عن جابر بن عبد الله رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«كُلُّ مَعْرُوفٍ صَدَقَةٌ».
[صحيح] - [رواه البخاري من حديث جابر، ورواه مسلم من حديث حذيفة] - [صحيح البخاري: 6021]
المزيــد ...
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు
“ప్రతి మంచి పని పుణ్యకార్యమే”.
[దృఢమైనది] - - [صحيح البخاري - 6021]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ప్రతి మంచి పని, లేక ఇతరులకు ప్రయోజనం కలిగేలా చేసిన ప్రతి కార్యము, అది మాటల ద్వారా కానీ లేక చేతల ద్వారా కానీ, అది పుణ్యకార్యమే అవుతుంది. దానికి పుణ్యము మరియు ప్రతిఫలము రెండూ ఉన్నాయి – అని తెలియజేస్తున్నారు.