عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَا تَبْدَؤوا الْيَهُودَ وَلَا النَّصَارَى بِالسَّلَامِ، فَإِذَا لَقِيتُمْ أَحَدَهُمْ فِي طَرِيقٍ فَاضْطَرُّوهُ إِلَى أَضْيَقِهِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2167]
المزيــد ...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చెప్పకండి. మరియు ఒకవేళ మీకు వారిలో ఎవరినైనా దారిలో ఎదురైతే వారిని దారి అంచుకు పోయేలా చేయండి.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2167]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా వివరించారు: "ఒక యూదునికి గానీ, లేక ఒక క్రైస్తవునికి గానీ, వారు ‘జిమ్మీ’ లు గా ఉన్నప్పటికీ, ఒక ముస్లిం ముందుగా సలాం చెప్పరాదు, మిగతా అవిశ్వాసుల సంగతి ఇక చెప్పనే అక్కరలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా వివరించారు: ఒకవేళ మనలో ఎవరైనా వారిలో ఒకరిని (యూదులు, లేక క్రైస్తవులలో ఒకరిని) రహదారిలో కలవడం జరిగితే, అతన్ని రహదారి యొక్క ఇరుకైన ప్రాంతానికి (దారి అంచులకు) వెళ్ళి పోయేలా చేయాలి. విశ్వాసి ఎప్పుడూ దారి మధ్యలో నడుస్తాడు. అవిశ్వాసి ఎప్పుడూ అతనికి దారి ఇస్తాడు. ఒక ముస్లిం ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించబడడు.