عن أبي ذر رضي الله عنه قال: قال لي النبي صلى الله عليه وسلم:
«لَا تَحْقِرَنَّ مِنَ الْمَعْرُوفِ شَيْئًا، وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2626]
المزيــد ...

అబూజర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు –
“సత్కార్యాలలో దేనినీ అల్పమైనదిగా భావించకండి; అది మీ సహోదరుణ్ణి చిరునవ్వు ముఖంతో, ఉల్లాసంగా కలవడమైనా సరే”.

[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 2626]

వ్యాఖ్యానము

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – సత్కార్యాలు చేయుటను గురించి ఉద్బోధిస్తున్నారు. సత్కార్యము ఎంత చిన్నదైనా దానిని అల్పమైనదిగా భావించరాదు. అందులో మనం ఎవరినైనా కలిసినపుడు వారిని ఉల్లాసంగా, చిరునవ్వు ముఖంతో పలుకరించడం, ఒక ముస్లిం సహోదరుని ముఖం పై ఉల్లాసం, సంతోషం, చిరునవ్వు చూడడం ఉన్నాయి. కనుక ప్రతి ముస్లిం తమ తోటి వారిని, తమ సహోదరులను పలుకరించునపుడు వీటిని ధ్యానంలో ఉంచుకోవాలి.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఇందులో – విశ్వాసుల మధ్య ప్రేమ, అభిమానాలు, మరియు ఒకరినొకరు కలిసినపుడు ఆహ్లాదంగా, చిరునవ్వుతో కలవడం – వాటి ప్రాముఖ్యత, ఘనత తెలుస్తున్నాయి.
  2. ఇందులో షరియత్ యొక్క సమగ్రత, విశ్వాసుల మధ్య ఐకమత్యం, వారందరూ ఒక్కటిగా ఉండుటకు సరియైన మార్గదర్శకత్వానికి అవసరమైన ప్రతి విషయాన్ని వారికి పొందుపర్చడం మనకు కనిపిస్తున్నాయి.
  3. సత్కార్యము చేయుట వైపునకు ఇందులో మనకు ఉద్బోధ కనిపిస్తున్నది, అది ఎంత చిన్నదైనా సరే.
  4. ముస్లిములు ఎల్లప్పుడూ తమ సహోదరులను సంతోషంగా చూడాలనే అభిలాష కలిగి ఉండుటకు, వారి మధ్య ప్రేమ, అభిమానాలు పెంపొందేలా చేయుటకు ఉద్బోధ ఉన్నది.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (68)
ఇంకా