عن أبي كريمة المقداد بن معد يكرب رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال: «إِذَا أَحَبَّ الرَّجُلُ أَخَاهُ، فَلْيُخْبِرْهُ أَنَّهُ يُحِبُّهُ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في السنن الكبرى وأحمد]
المزيــد ...

అబీ'కరీమ అల్'మిక్దాద్'బిన్'మాదీకరబ్'రజి'ప్రవక్తద్వారాఉల్లేఖిస్తున్నారు“ఒక వ్యక్తి తన సోధరున్ని ప్రేమిస్తున్నప్పుడు అతనికి ఆ విషయాన్ని తప్పకుండా తెలియచేయాలి."
దృఢమైనది - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు

వివరణ

పరస్పరం అల్లాహ్ కొరకు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలని ఎన్నో ప్రామాణిక హాదీసులు ప్రభోదిస్తున్నాయి.దానికి సంబందించిన పుణ్యప్రతిఫలాల గురించి తెలియపరుస్తున్నాయి, ఈ హదీసు ఒక ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది.దీనివలన పరస్పరం విశ్వాసులపై గొప్ప ప్రభావం పడుతుంది, ఒకరికొకరిపై ప్రేమాభిమానాలు పెరుగుతాయి. అదేమిటంటే ఒక వ్యక్తి తన సోదరుడిని ప్రేమిస్తున్నట్లు తెలియజేయాలి’ ఇది ముస్లిం సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్న పరిచే కారణాల నుండి పరిరక్షించడంలో ప్రయోజనం చేకూరుస్తుంది.ఇది ఇస్లామీయ సమాజంలో వ్యక్తుల మధ్య ప్రేమను వ్యాప్తి చేయడం మరియు ముస్లిం సోదరభావం ద్వారా,సామాజిక బంధాలను బలోపేతం చేయడం, ప్రేమను పెంపోదించే కారణాలను గమనించి కార్యసాధన చేయడం ద్వారా సాధించవచ్చు, దీనికి ఉదాహరణ-అల్లాహ్ కొరకు ప్రేమిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ సర్వశక్తివంతుడైన అల్లాహ్ కొరకు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని చెప్పుకోవడం!

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఎవరైతే తన సోదరుడిని అల్లాహ్ కొరకు ప్రేమిస్తున్నాడో ,తప్పనిసరిగా అతనికి ఆ విషయం తెలియజేయాలి.
  2. ఇలా తెలియజేయడం వల్ల చేకూరే ప్రయోజనం ఏమిటంటే ఒకవేళ ఇతను తనను ప్రేమిస్తున్నాడన్న విషయం తెలిస్తే తనను సూచిస్తున్న ఉపదేశాన్నితప్పకుండా స్వీకరిస్తాడు. మరియు అతని శ్రేయస్కరం కొరకు చెప్పే మాటను తిరస్కరించడు.
  3. అల్లాహ్ కొరకు ప్రేమిస్తున్న విషయం చెప్పడం ప్రేమను మరియు సాన్నిహిత్యాన్ని పెంచడానికి ఒక ముస్తహబ్బ్ కార్యంగా పరిగణించబడును.
ఇంకా