ఉప కూర్పులు

హదీసుల జాబితా

“ఒక వ్యక్తి తన తోటి సోదరుడిని ప్రేమిస్తున్నట్లయితే, ఆ వ్యక్తి తను ప్రేమిస్తున్న విషయాన్ని అతనికి తెలియ జేయాలి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“కొనుగోలు చేసేటపుడు, అమ్మేటపుడు మరియు అప్పు తిరిగి ఇచ్చివేయమని అడిగేటపుడు మృదువుగా వ్యవహరించే వానిని అల్లాహ్ కరుణించుగాక”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
. . .
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ ప్రతి విషయంలోనూ కారుణ్యం కలిగి ఉండాలని ఆదేశించినాడు*. కనుక ఒకవేళ ఏదైనా ప్రాణిని చంపితే (చంప వలసి వస్తే), ఆ ప్రక్రియను యుక్తమైన విధంగా నిర్వహించండి, అలాగే ఏదైన ప్రాణిని అల్లాహ్ పేరున జిబహ్ చేస్తే (చేయవలసి వస్తే), ఆ ప్రక్రియను కూడా యుక్తమైన విధంగా నిర్వహించండి. మీలో ఒకరు (ఎవరు ఆ పనిని నిర్వహిస్తారో వారు) ఆ ప్రాణికి బాధ తెలియనంత పదునుగా ఉండేలా తన కత్తికి పదును పెట్టాలి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “నాకు ఏమైనా బోధించండి” అని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “@కోపం తెచ్చుకోకు*” (కోపానికి దూరంగా ఉండు) అని పలికారు. అతడు పలుమార్లు అదే ప్రశ్నను అడిగాడు. ప్రతీ సారీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “కోపం తెచ్చుకోకు” (కోపానికి దూరంగా ఉండు) అని సమాధానమిచ్చారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సత్కార్యాలలో దేనినీ అల్పమైనదిగా భావించకండి; అది మీ సహోదరుణ్ణి చిరునవ్వు ముఖంతో, ఉల్లాసంగా కలవడమైనా సరే”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ చేసి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అన్నాడు. దానికి ఆయన "నా వద్ద (జంతువు) లేదు" అన్నారు. ఒక వ్యక్తి (లేచి) "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైతే ఇతనికి సవారీ జంతువును ఇవ్వగలగే స్తోమత ఉన్నదో, ఇతణ్ణి అతని వద్దకు మార్గదర్శకం చేస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "@ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది*" అన్నారు.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, (పలికితే) మంచి మాటలే పలకాలి లేదా మౌనంగా ఉండాలి*. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన పొరుగు వాని పట్ల ఔదార్యము, ఉదార వైఖరి కలిగి ఉండాలి. అలాగే అల్లాహ్’ను మరియు అంతిమ దినమును విశ్వసించే వారు ఎవరైనా సరే, తన అతిథికి (వీలైనంతలో) ఆదరపూర్వకం గా అతిథి సత్కారాలు చేయాలి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే జనులపై కరుణ చూపడో మహోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ అటువంటి వానిపై కరుణ చూపడు".
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక వ్యక్తి తోటి సహోదరునితో ‘వినయం, నమ్రత కలిగి ఉండు’ అని అంటూ ఉండగా విన్నారు. అపుడు ఆయన ఇలా పలికారు “@‘అల్ హయా’ (వినయము, నమ్రత) కలిగి ఉండుట విశ్వాసములో ఒక భాగము*”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది*. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా దైవభీతిపరుడిని, భయభక్తులు కలవాడిని, (అనవసరమైన) వాంఛలు, కోరికలు లేని వాడిని, మరియు గుంభనముగా ఉండేవాడిని అల్లాహ్ ప్రేమిస్తాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
: .
عربي ఇంగ్లీషు ఉర్దూ
“విశ్వాసి తన సత్ప్రవర్తన, సభ్యత, ఉత్తమ నడవడికల ద్వారా పుష్కలంగా సలాహ్ (నమాజు) లు మరియు ఉపవాసాలు ఆచరించే వాని స్థాయిని పొందుతాడు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్లీల, అసభ్య వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆయనెప్పుడూ అశ్లీల, అసభ్య భాషను ఉపయోగించలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “@నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“కరుణ చూపే వారిపై, అనంత కరుణాప్రదాత (అర్రహ్మాన్) కరుణ చూపుతాడు; కనుక భూమిపై ఉన్నవారిపై కరుణ చూపండి, ఆకాశంలో ఉన్నవాడు మీపై కరుణ చూపుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ యొక్క ఒక దాసుడు, అల్లాహ్ యొక్క మరొక దాసుడుని (అతని తప్పులను) ఈ ప్రపంచములో కప్పి ఉంచితే, పునరుత్థాన దినమున అల్లాహ్ అతడిని (అతని తప్పులను) కప్పి ఉంచుతాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మం మరియు పాపం గురించి అడిగాను, వారు ఇలా జవాబిచ్చారు:@ "ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”.
عربي ఇంగ్లీషు ఉర్దూ
:
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక విశ్వాసి అపవాది కాజాలడు (ఇతరులపై అపవాదులు మోపు వాడు), ఇతరులను శపించడు మరియు అనైతిక చర్యలకు పాల్బడడు లేదా సిగ్గుమాలిన పనులు చేయడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
.
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా మీలో నాకు ప్రియమైన వారు,ప్రళయ దినాన నాకు దగ్గరగా కూర్చుంటారు,వారుఎవరంటే ‘ప్రవర్తన రీత్యా* ,ఉత్తమ నడవడిక కలవారే’ మీలో నాకు నచ్చని వారు అసహ్యపరులు,పరలోకదినాన నాకు అత్యంత దూరంగా కూర్చుంటారు వారుఎవరంటే ‘ఎక్కువగా నోటి దూల కలిగి ఆలోచన లేకుండా మాట్లాడేవారు మరియు నోటి దురుసు కలిగినవారు,"ముతఫైహిఖూన’అంటే ఏమిటి అని అడిగారు దానికి ప్రవక్త ‘గర్వాన్ని ప్రదర్శించేవారు అని బదులిచ్చారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
"ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసభ్యంగా మాట్లాడేవారు కాదు, అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు, సంతల్లో (బజార్లలో) గొడవపడి అరవేవారు కాదు, తనకు చెడు చేసినవారికి చెడుతో ప్రతిస్పందించేవారు కాదు, కానీ ఆయన క్షమించేవారు, మన్నించేవారు."
عربي ఇంగ్లీషు ఉర్దూ
"నన్ను పంపబడిన ముఖ్య ఉద్దేశ్యం — ఉత్తమ నైతిక విలువలను (మంచి స్వభావాలను) పరిపూర్ణం చేయడమే."
عربي ఇంగ్లీషు ఇండోనేషియన్