عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «من كان يؤمن بالله واليوم الآخر فليقل خيرًا أو ليصْمُت، ومن كان يؤمن بالله واليوم الآخر فليُكْرِم جارَه، ومن كان يؤمن بالله واليوم الآخر فليكرم ضَيْفَه».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ హురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం’ఎవరైతే అల్లాహ్ పై మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను మేలైన విషయాలు మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండాలి,మరేవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని అతను గౌరవించాలి, ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అతిథిని గౌరవించాలి.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీస్ లో అబూ హురైరా రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ నుండి కొన్ని సమగ్ర సామాజిక సూత్రాలను తెలియజేశారు, ఆయన ఇలా అన్నారు: "c2">“مَنْ كَانَ يُؤمِنُ ;ఎవరైతే అల్లాహ్ ను విశ్వశిస్తారో” ఇది వ్యాఖరణం రీత్యా ‘’ ఈ వాఖ్యము షరతుతో కూడినది’"فَليَقُلْ خَيْرَاً أَو لِيَصْمُتْ"، అతడు మంచి మాటలు చెప్పాలి లేదా నిశ్శబ్దంగా ఉండాలి” మంచిని చెప్పడం లేదా నిశ్శబ్దంగా ఉండటం పట్ల ప్రజలను ప్రోత్సహించడానికి ఈ ప్రసంగ శైలిని ఉపయోగిండం యొక్క ముఖ్య ఉద్దేశ్యం,మహనీయ దైవప్రవక్త బహుశా తెలియజేశారు' ఒకవేళ నీవు అల్లాహ్ మరియు పరలోకదినాన్ని విశ్వసించినట్లైతే ‘మంచిని మాట్లాడు లేదా నిశబ్దం వహించు,- "فَلَيَقُلْ خَيرَاً"అనగా అతను ఒక మాటను దానిలో ఎలాంటి మంచి లేకున్నా తన చుట్టు కూర్చున్న వారిని కేవలం నవ్వించడం కొరకు చెప్తుండటం కూడా మంచిలో నమోదు అవుతుంది ఎందుకంటే దానివల్ల సన్నిహిత్యం పెరిగి భయం దూరమవుతుంది,మరియు ప్రేమ జనిస్తుంది "أو لِيَصْمُتْ" అంటే నిశబ్దాన్ని పాటించడం, "وَمَنْ كَانَ يُؤمِنُ باللهِ وَاليَومِ الآخِرِ فَلْيُكْرِمْ جَارَهُ"అంటే పొరుగింటివారిని గౌరవించాలి,పదాన్ని బాహ్య పరంగా చూస్తే ‘బజారులో పొరుగువాడిని అంటే దుకాణం ప్రక్క దుకాణంవాడు’ఇందులోకి వస్తాడు,కానీ మొదటి అర్ధం అనగా ‘పొరుగింటివాడు’దృవీకరించబడుతుంది,పొరుగువాడు మీకు ఎంత దగ్గరగా ఉంటే అతని హక్కు అంత పెరుగుతుంది,దైవప్రవక్త ‘{الإكرام గౌరవం}పదాన్ని ఉపయోగిస్తూ‘"فليُكْرِم جَارَهُ"తన పొరుగువారిని గౌరవించాలి’అని తెలిపారు’అతనికి దిర్హం,దానం,దుస్తుల లాంటివి ఇవ్వండి అని చెప్పలేదు’షరీయతులో ఏదైన విషయం కేవలం ప్రస్తావించబడినప్పుడు దాని అర్ధం తెలుసుకొనుటకు ‘ఉర్ఫ్ ‘{వాడుకలో}’చూడబడుతుంది,కాబట్టి الإكرام పదంకు ప్రత్యేకఅర్ధం ఇవ్వకుండా సాధారణంగా ప్రజలు ఇచ్చే గౌరవం అని పరిగణించ బడుతుంది,వేర్వేరు వారితో వేర్వేరు ప్రకారంగా చూపబడుతుంది,మీ పొరుగువాడు పేదవాడు అయినప్పుడు అతనికి రొట్టెలు ఆహారంగా ఇస్తూ గౌరవించబడుతుంది,ఒకవేళ అతను ధనికుడైతే అతని గౌరవానికి ఇది సరిపోదు,లేనివాడికి కొంచం ఇచ్చిన అది అతనికి సరిపోతుంది కానీ పొరుగువాడు పలుకుబడికలవాడైనప్పుడు గౌరవం అవసరం ఎక్కువగా ఉంటుంది, { '{الجارపొరుగువాడు : అనగా ఇంటికి ప్రక్కన ఉన్నవాడా లేక బజారులో భాగస్వామిగా ఉన్నవాడా?ఎదురుండువాడా?మరి ఎవరు? దీని కొరకు కూడా ఉర్ఫ్ ‘వాడుక’లో ఉన్నది చూడవలసిందే,ఇక ప్రవక్త మాట ప్రకారం:"وَمَنْ كَانَ يُؤمِنُ باللهِ واليَومِ الآخِرِ فَليُكرِمْ ضَيْفَهُ -అతిథి الضيفఅనగా ‘మీ ఇంట్లో ఉండబోయే వ్యక్తి’మీ వద్ద ఆగిన ప్రయాణీకుడు,ఇతను అతిథి కాబట్టి అతన్ని గౌరవించడం శక్తిరీత్యా తప్పనిసరి విధి,కొంతమంది ధార్మిక వేత్తల రహిమాహుముల్లాహ్ ప్రకారంగా' ఆతీథ్యం ఇవ్వడమనేది గ్రామాల్లో ఉన్నప్పుడూ చిన్ననగరంలో ఉన్నప్పుడూ విధి అవుతుంది,ఇక పట్టణాల్లో లేదా పెద్ద నగరాల్లో తప్పనిసరికాదు ఎందుకంటే అక్కడ హోటళ్లు,ఫలహారాశాలలు అతను వెళ్లడానికి ఉపయోగపడతాయి,కానీ చిన్న గ్రామాల్లో మనిషికి ఉండటానికి ప్రదేశం అవసరం ఉంటుంది,కానీ హదీసు సాదారణ అర్ధం ఇస్తుంది - "فَليُكْرِمْ ضَيْفَهُ".తన అతిథిని గౌరవించాలి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. నాలుక వల్ల ఏర్పడే ఆపదల నుండి హెచ్చరించబడుతుంది,కాబట్టి ప్రతీ మనిషి మాట్లాడేముందు తాను ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆలోచించాలి.
  2. మేలైన విషయాలను మినహాయించి నిశబ్దాన్ని పాటించడం అనివార్యము.
  3. పొరుగువారి హక్కును నిర్వచించబడినది మరియు వారిని పరిరక్షించి గౌరవించాలని ప్రోత్సహించబడినది.
  4. అతిథి ని గౌరవించమని ఆదేశించబడినది,ఇది ఇస్లామీయ మర్యాదల్లోనిది మరియు ప్రవక్తల అలవాట్లకు సంబంధించినది.
  5. ఇస్లామీయ ధర్మం కారుణ్యధర్మం,పరస్పర సన్నిహిత్యాన్ని మరియు పరస్పర పరిచయాన్ని పెంపొందించే ధర్మం.
  6. అల్లాహ్ మరియు పునరుత్తాన దినం పై విశ్వాసం ప్రతీ మేలు కొరకు ప్రధానమైనది,అది దైవనమ్మకం మరియు దైవభీతి,భయాన్ని పెంపొందిస్తాయి.
  7. సంభాషణలో మంచివి ఉంటాయి,చెడువి ఉంటాయి మరియు మంచిచెడు లేనివి కూడా ఉంటాయి.
  8. ఈ సద్గుణాలు ఈమాన్ శాఖకు మరియు ఇస్లామీయ మర్యాదలకు సంభందించినవి.
  9. నిశ్చయంగా కార్యకలాపాలు విశ్వాసం లోప్రవేశిస్తాయి
  10. నిశ్చయంగా ఈమాన్ పెరుగుతుంది మరియు తగ్గుతుంది
ఇంకా