عن شداد بن أوس رضي الله عنه مرفوعًا:« إن الله كتب الإحسانَ على كل شيء، فإذا قتلتم فأحسِنوا القِتلةَ وإذا ذبحتم فأحسِنوا الذِّبحة، وليحد أحدُكم شَفْرَتَه ولْيُرِحْ ذبيحتَهُ».
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

షద్దాద్ బిన్ ఔస్ రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ విషయం పై ఇహ్సాన్ ను(అత్యుత్తమం) విధి చేశాడు,కాబట్టి మీరు ఉత్తమంగా వదించండి,ఉత్తమంగా జుబాహ్ చేయండి,మీ కత్తులను పదునుపర్చుకొండి,జంతువులకు ఉపశమనమును ప్రసాదించండి.
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఒక ముస్లిమును తన సంకల్పం మరియు అంతరంగాన్ని ఉత్తమంగా ఉంచుకోవాలని,తన విధేయత మరియు ఆరాధనలు ఉత్తమంగా మార్చుకోవాలని,తన కార్యకలాపాలు మరియు కర్మలు ఉత్తమంగా మలుచుకోవాలని,ప్రజల పట్ల మరియు పశుపక్షాదుల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని,చివరికి నిర్జీవుల పట్ల కూడా ఉత్తమంగా ఉండాలని కోరబడుతుంది,జుబాహ్ చేయు వ్యక్తి జుబాహ్ ద్వారా జంతువుకు భాధ కలిగిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ అది ఖచ్చితంగా ఉపయోగం కోసం మాత్రమే వధించబడాలి,అయితే విశ్వాసి మనసులో మృదుత్వం,దయ,కరుణ, మరియు జాలి గుణాల శిక్షణనివ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యం,తద్వారా అతను వధించేటప్పుడు లేదా న్యాయంగా హతమారుస్తున్నప్పుడు ఆ అర్థాలను మరువకుండ ఉంటాడు,ఇందులో ఒక హెచ్చరిక ఉంది,నిశ్చయంగా ఇహ్సాన్ ‘అత్యుత్తమను’ జుబాహ్ మరియు వధలో కోరినప్పుడు ఇతర కార్యక్రమాల్లో దానికంటే అత్యధికంగా ఇహ్సాన్ ను పూరించాల్సి ఉంది,వధించేటప్పుడు కత్తిని పదును పర్చుకోవడం,జంతువుకు ఉపశమనమును చేకూర్చడం ఇహ్సాన్ లో ఒక భాగము.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఇహ్సాన్ యొక్క ఆదేశం ప్రతీ వ్యవహారములో దానికి తగ్గట్టుగా ఉంటుంది,ఇహ్సాన్ ను దాని అంతర్గత,బహిర్గత విధులతో ఆచరించాలి,ఇహ్సాన్' ను పరిపూర్ణంగా పాటించడం దాని విధులలోఒకటి. ఇహ్సాన్ యొక్క ఈ పరిమాణం అందులో తప్పని సరి. ఇక వాటి ముస్తహబ్హాతులను పరిపూర్ణం చేసే ఇహ్సాన్ ముస్తహబ్ (సమ్మతము) అవుతుంది. మరియు నిషిద్దతాలను వదిలే విషయంలో ఇహ్సాన్ : వాటి నుండి దూరంగా ఉండటం మరియు వాటి బహిర్గతాలను మరియు అంతర్గతాలను వదిలివేయటం. ఇహ్సాన్ యొక్క ఈ పరిమాణం తప్పనిసరి. సంభవమైన వాటిపై సహనం చూపే విషయంలో ఇహ్సాన్ : క్రోదం లేకుండా సహనం కోల్పోకుండా సహనం చూపటం. సృష్టితాల యొక్క వ్యవహారం విషయంలో మరియు వారి పట్ల వ్యవహరించే తీరు విషయంలో తప్పనిసరైన ఇహ్సాన్ : అల్లాహ్ విధిగావించిన వారి హక్కులను నెరవేర్చటం. సృష్టితాల స్నేహం విషయంలో తప్పనిసరైన ఇహ్సాన్ : ధర్మ బద్ధం చేయబడి విధిగావించబడిన స్నేహమును నెరవేర్చటం. జిబాహ్ చేయటం సమ్మతించబడిన జంతువులను జిబాహ్ చేసే విషయంలో ఇహ్సాన్ : త్వరగా,సులువుగా ఏ విధమైన అధిక బాధ లేకుండా దాన్ని కోయటం. ఎందుకంటే అది అనవసరంగా దాన్ని బాధ పెట్టటం అవుతుంది.
  2. మహోన్నతుడు శక్తిమంతుడు- అల్లాహ్ తన దాసుల పట్ల మృదుత్వాన్ని కలిగి ఉన్నాడు, ఆయన ప్రతీ వస్తువుపై ఇహ్సాన్ (ఉత్తమ వ్యవహారము) ను విధిపర్చాడు.
  3. మహోన్నతుడు శక్తిమంతుడు అల్లాహ్ కొరకు మాత్రమే సర్వఆదేశాలు మరియు వివేకాలు చెందుతాయి,అల్లాహ్ సెలవిచ్చాడు : నిశ్చయంగా మహోన్నతుడు అల్లాహ్ ‘ఇహ్సాన్’ను రచించాడు,అల్లాహ్ రచన అనేది రెండు రకాలు: ఒకటి విధిరచన,రెండు శరీయతు రచన.
  4. ఇహ్సాన్ ప్రతీ వస్తువుతో ముడిపడి ఉంది,ప్రతీ వస్తువులో ఇహ్సాన్ ఇమిడి ఉంది;అల్లాహ్ వాక్యం ప్రకారంగా :నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుపై ఇహ్సాన్ ను వ్రాశాడు’
  5. ఉపమానాల ద్వారా దైవప్రవక్త యొక్క ఉత్తమ భోద స్పష్టమవుతుంది,ఎందుకంటే ఉపమానాలు అర్ధానికి చేరువ చేస్తాయి,ఆయన వాక్యంప్రకారంగా : إِذَا قَتَلتُمْ. إِذَا ذَبَحْتُمْ. మీరు హతమార్చినప్పుడు.మీరు వధించినప్పుడు.
  6. హంతకుల పట్ల ఇహ్సాన్ తప్పనిసరి,ఎందుకంటే ఇది రూపం యొక్క వర్ణన,చర్య కోసం కాదు.
  7. ఖుర్బానీజంతువు పట్ల ఇహ్సాన్ వ్యవహరించాలి ఎందుకంటే మనము దాన్ని ధర్మ పద్దతి ప్రకారంగా వధిస్తున్నాము.
  8. జంతువుకు హనీ కలిగించడం నిషేదము,ఉదా : విల్లు విధ్య నేర్చుకునే ఉద్దేశంతో హింసించడం,అన్నపానీయాలు లేకుండా చేయటం కట్టేయడం.
  9. ఇస్లామీయ శరీయతు యొక్క పరిపూర్ణత మరియుసంపూర్ణ మేలును కూడిన శరీయతు తీరు తెలుస్తుంది,జంతువుల పట్ల దయ చూపడం మరియు జంతువుల పట్ల మృదువైఖరి అవలంబించడం వాటి ఉదాహరణలు.
ఇంకా