عَنْ أَبِي مُوسَى رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوبَ مُسِيءُ النَّهَارِ، وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوبَ مُسِيءُ اللَّيْلِ، حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2759]
المزيــد ...
అబూ మూసా ఇబ్న్ ఖైస్ అల్ అష్’అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: :
“నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 2759]
ఈ హదీసులో అల్లాహ్ తన దాసులనుండి పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. ఒకవేళ దాసుడు పగటి పూట పాపానికి పాల్బడి, రాత్రి పూట అతడు పశ్చాత్తాపం చెందితే, అతడి పశ్చాత్తాపాన్ని అల్లహ్ స్వీకరిస్తాడు. ఒకవేళ అతడు రాత్రి పూట పాపానికి పాల్బడి, ఉదయం అతడు పశ్చాత్తాపం చెందితే, అతడి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. పరమ పవిత్రుడైన అల్లాహ్ తన చేతిని ముందుకు చాచుతాడు దాసుల పశ్చాత్తాపం కొరకు, వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించుటలో ఆయన ఆహ్లాదం పొందుతాడు, అమితంగా సంతోషిస్తాడు. ఈ పశ్చాత్తాపపు ద్వారము, ప్రళయాన్ని సూచిస్తూ, సూర్యుడు పడమటి నుండి ఉదయించేంత వరకూ తెరుచుకునే ఉంటుంది. సూర్యుడు పడమటి నుండి ఉదయించినపుడు ఆ పశ్చాత్తాపపు ద్వారం మూసుకుపోతుంది.