హదీథుల జాబితా

‘ప్రతీ ఆదమ్ కుమారుడు తప్పు చేస్తాడు కానీ చేసిన తప్పుకు పశ్చాత్తాప చెందినవాడే అందులో శ్రేష్టుడు.
عربي الإنجليزية الأوردية
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు
عربي الإنجليزية الأوردية
“నిశ్చయంగా సర్వశక్తిమంతుడు, సర్వోత్కృష్టుడు అయిన అల్లాహ్ (ప్రతి) రాత్రి తన చేతిని ముందుకు చాచుతాడు, పగటిపూట పాపానికి ఒడిగట్టినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; మరియు (ప్రతి) పగలు తన చేతిని ముందుకు చాచుతాడు, రాత్రి పూట పాపము చేసినవాడు పశ్చాత్తాప పడుటకు గాను; ఇలా సూర్యుడు పడమటి నుండి ఉదయించే వరకు జరుగుతుంది.”
عربي الإنجليزية الأوردية
“ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను
عربي الإنجليزية الأوردية
“ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు
عربي الإنجليزية الأوردية
అల్లాహ్ నిషేధించిన ఈ అశుద్ధ (పాపకార్యాల) నుండి దూరంగా ఉండండి. ఎవరైతే ఆ పాపం చేస్తే, అల్లాహ్ బహిరంగం చేయని దానిని, తను కూడా బహిరంగం చేయకుండా దాచి పెట్టాలి మరియు అల్లాహ్ వైపు తౌబా (పశ్చాత్తాపం) చేయాలి. ఎందుకంటే, ఎవరు తన తప్పును మాకు బహిర్గతం చేస్తారో, మేము అల్లాహ్ గ్రంథం (షరియా) ప్రకారం అతనిపై శిక్షను అమలు చేస్తాము
عربي الإنجليزية الأوردية
నిశ్చయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిద్రపోడు మరియు నిద్రపోవడం ఆయనకు తగదు
عربي الإنجليزية الأوردية
మీరు నాతో ఈ విషయాలపై ప్రమాణం చేయండి: అల్లాహ్‌ కు ఎవరినీ భాగస్వాములుగా చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు
عربي الإنجليزية الإندونيسية