+ -

‌عن عَلِيٍّ قَالَ: إِنِّي كُنْتُ رَجُلًا إِذَا سَمِعْتُ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَدِيثًا نَفَعَنِي اللهُ مِنْهُ بِمَا شَاءَ أَنْ يَنْفَعَنِي بِهِ، وَإِذَا حَدَّثَنِي رَجُلٌ مِنْ أَصْحَابِهِ اسْتَحْلَفْتُهُ، فَإِذَا حَلَفَ لِي صَدَّقْتُهُ، وَإِنَّهُ حَدَّثَنِي ‌أَبُو بَكْرٍ، وَصَدَقَ أَبُو بَكْرٍ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَا مِنْ رَجُلٍ يُذْنِبُ ذَنْبًا، ثُمَّ يَقُومُ فَيَتَطَهَّرُ، ثُمَّ يُصَلِّي، ثُمَّ يَسْتَغْفِرُ اللهَ، إِلَّا غَفَرَ اللهُ لَهُ»، ثُمَّ قَرَأَ هَذِهِ الْآيَةَ: {وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ} [آل عمران: 135].

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وابن ماجه وأحمد] - [سنن الترمذي: 406]
المزيــد ...

అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఎటువంటి వ్యక్తినంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఏదైనా హదీథు వింటే దాని ద్వారా అల్లాహ్ నాకు ఎంత మేలు చేకూర్చ దలిస్తే అంత మేలు చేకూర్చేవాడు (అంత మంచిగా నేను ఆ హదీసును ఆచరించేవాడిని). ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఎవరైనా నాకు హదీథు వినిపిస్తే అతణ్ణి ప్రమాణం చేసి చెప్పమని అడిగే వాడిని. అతడు ప్రమాణం చేస్తే నేను (అతడు చెప్పినది సత్యమని) అతడిని విశ్వసించే వాడిని. అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఒకసారి ఒక హదీసును ఉల్లేఖించినారు. ఆయన సత్యము పలికినారు. ఆయన ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను:
“ఎవరైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేచి నిలబడి, తనను తాను పరిశుద్ధ పరుచుకుని, నమాజును ఆచరించి, అల్లాహ్ యొక్క క్షమాభిక్షను అర్థించినట్లయితే, అల్లాహ్ అతడిని తప్పక క్షమిస్తాడు”, తరువాత ఆయన (అబూబక్ర్ రజియల్లాహు అన్హు ఈ ఆయతును పఠించినారు: {وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ} [آل عمران: 135] {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుద్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలి ఇమ్రాన్: 3:135]

[దృఢమైనది] - - [سنن الترمذي - 406]

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: (అల్లాహ్ యొక్క) దాసులలో ఎవరైనా ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు లేక ఆమె తనను తాను పరిశుద్ధపరుచుకుని (వుదూ అవసరమైతే వుదూ, లేక ఘుసుల్ అవసరమైతే గుసుల్ ఆచరించి), నిలబడి తను పాల్బడిన పాపానికి పశ్చాత్తాప పడే సంకల్పముతో, రెండు రకాతుల నమాజు ఆచరించి, అల్లాహ్ ను క్షమాభిక్ష కోరితే అల్లాహ్ తప్పకుండా క్షమిస్తాడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క వాక్కులను పఠించినారు: {والذين إذا فعلوا فاحشة أو ظلموا أنفسهم ذكروا الله فاستغفروا لذنوبهم ومن يغفر الذنوب إلا الله ولم يصروا على ما فعلوا وهم يعلمون} {మరియు ఎవరైతే, అశ్లీలపనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్‌ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్‌ తప్ప, పాపాలను క్షమించగలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను) బుధ్ధిపూర్వకంగా మూర్ఖపుపట్టుతో మళ్ళీ చేయరు!} [సూరహ్ ఆలె ఇమ్రాన్: 3:135]

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ ఇండోనేషియన్ ఉయ్ఘర్ టర్కిష్ బోస్నియన్ సింహళ హిందీ వియత్నమీస్ కుర్దిష్ హౌసా మలయాళం స్వాహిలీ బర్మీస్ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية التشيكية Малагашӣ Урумӣ Канада الأوكرانية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో - (మన వల్ల) ఏదైనా పాపపు పని జరిగిపోతే, వెంటనే నమాజు ఆచరించి అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరాలనే ప్రోత్సాహము ఉన్నది.
  2. అలాగే ఇందులో సర్వోన్నతుడూ, సర్వ శక్తిమంతుడూ అయిన అల్లాహ్ యొక్క అపారమూ, అనంతమూ అయిన క్షమాగుణము, ఆయన తన దాసుల పశ్చాత్తాపాన్ని స్వీకరించుట మరియు వారిని క్షమించుట గురించి తెలియుచున్నది.
ఇంకా