عَنْ عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ:
تَلَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ هَذِهِ الْآيَةَ: {هُوَ الَّذِي أَنْزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ، وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ، وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِنْ عِنْدِ رَبِّنَا وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ} [آل عمران: 7]. قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «فَإِذَا رَأَيْتِ الَّذِينَ يَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ فَأُولَئِكَ الَّذِينَ سَمَّى اللهُ، فَاحْذَرُوهُمْ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4547]
المزيــد ...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 4547]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు:{ఆయన (అల్లాహ్)యే నీపై (ఓ ము'హ మ్మద్!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు, సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను అపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు:''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞాన వంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఇందులో అల్లాహ్ సుబ్’హానహూ వ త’ఆలా తానే తన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దివ్య ఖుర్’ఆన్ ను అవతరింపజేసినాను అని అంటున్నాడు; అందులో విస్పష్టమైన ఆయతులు ఉన్నాయని, వాటిలోని ఆదేశాలు, మరియు నిబంధనలలో ఎటువంటి అస్పష్టత లేనివి అని అంటున్నాడు. అవి దివ్య గ్రంథానికి పునాది వంటివి, మరియు నిర్దేశకాల (reference) వంటివి (దిశా నిర్దేశము చేయునటువంటివి). ఆయతుల మధ్య అనంగీకార సందర్భాలలో ఇవి (సరియైన అర్థం వైపునకు) దిశా నిర్దేశము చేస్తాయి. అదే విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని కొన్ని ఆయతులు ఒకటి కంటే ఎక్కువ అర్థాలనిచ్చే సంభావ్యత కలిగినవి ఉన్నాయి. కనుక అవి కొంతమంది ప్రజలను (వెంటనే అర్థం కాక) అస్పష్టతకు గురి చేయవచ్చు, లేక ఈ ఆయతుల మధ్య మరియు ఇతర ఆయతుల మధ్య సమన్వయం లేదు అనిపించవచ్చు. అటువంటి ఆయతుల పట్ల ప్రజలు ఏవిధంగా వ్యవహరిస్తారో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అటువంటి ఆయతుల సరియైన అర్థాన్ని తెలుసుకునే క్రమంలో కొందరు, పునాదుల వంటి ఆయతులను (సంప్రదించకుండా) వదిలి వేస్తారు. తమ అవగాహనకు దగ్గరగా ఉన్న అర్థాన్ని తీసుకుంటారు. ఆ విధంగా ప్రజలలో సందేహాలను రేకెత్తిస్తారు, వారిని అపమార్గం పట్టిస్తారు. అలాగే ఎవరైతే తమ ఙ్ఞానములో స్థిరంగా ఉంటారో, వారు ఈ (ఒకటి కంటే ఎక్కువ అర్థాలను ఇచ్చే) ఆయతులను గురించి ఎరుగుదురు. వారు పునాదుల వంటి ఆయతుల దిశా నిర్దేశములో వాటి అర్థాన్ని గ్రహిస్తారు, మరియు వాటిలో అస్పష్టతగానీ, సమన్వయలోపం గానే ఏమీ లేదని, అవి సర్వ శక్తిమంతుడూ, సర్వోత్కృష్టుడూ అయిన అల్లాహ్ తరఫునుండి అని విశ్వసిస్తారు. అయితే స్వాస్థ్యమేధస్సు గలవారు మాత్రమే దాని నుండి గ్రహిస్తారు మరియు నేర్చుకుంటారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల మాత (ఉమ్ముల్ మోమినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా తో ఒకవేళ తను ఆ విధంగా దివ్య ఖుర్’ఆన్ లోని అస్పష్టమైన ఆయతుల వెంట పడేవారిని గనుక చూసినట్లైతే, వారిని గురించి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు) అని, వారితో జాగ్రత్తగా ఉండమని అన్నారు, వారు చెప్పేది విన వద్దు అని అన్నారు.