+ -

عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ:
سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «قَالَ اللَّهُ تَبَارَكَ وَتَعَالَى: يَا ابْنَ آدَمَ إِنَّكَ مَا دَعَوْتَنِي وَرَجَوْتَنِي غَفَرْتُ لَكَ عَلَى مَا كَانَ فِيكَ وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ لَوْ بَلَغَتْ ذُنُوبُكَ عَنَانَ السَّمَاءِ ثُمَّ اسْتَغْفَرْتَنِي غَفَرْتُ لَكَ، وَلاَ أُبَالِي، يَا ابْنَ آدَمَ إِنَّكَ لَوْ أَتَيْتَنِي بِقُرَابِ الأَرْضِ خَطَايَا ثُمَّ لَقِيتَنِي لاَ تُشْرِكُ بِي شَيْئًا لأَتَيْتُكَ بِقُرَابِهَا مَغْفِرَةً».

[حسن] - [رواه الترمذي] - [سنن الترمذي: 3540]
المزيــد ...

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “పరమ పవిత్రుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుని, నన్ను అర్ధించినంత కాలం, నా నుండి నీవు ఆశించినంత కాలం, నీలో ఏదైతే ఉన్నదో దానిని నేను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీ పాపాలు ఆకాశపు మేఘాలను చేరేటంత ఎక్కువగా ఉన్నా, అపుడు నీవు నన్ను క్షమించమని వేడుకుంటే, నేను నిన్ను క్షమిస్తాను మరియు దానిని నేను పట్టించుకోను. ఓ ఆదం కుమారుడా! నీవు భూమి అంత పెద్ద పెద్ద పాపాలతో నావద్దకు వచ్చినా, నాకు సమానంగా ఎవరినీ భాగస్వామిగా చేయకుండా నన్ను కలుసుకుంటే నేను అంతకంటే గొప్ప క్షమాపణతో నీ వద్దకు వస్తాను.”

[ప్రామాణికమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు] - [سنن الترمذي - 3540]

వివరణ

సకల శుభాల యజమాని, సర్వోన్నతుడు అయిన అల్లాహ్, హదీథ్ అల్ ఖుద్సీ లో ఇలా ప్రకటించాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు: ‘ఓ ఆదం కుమారుడా! నీవు నన్ను వేడుకుంటూ, నా దయ మరియు కరుణను ఆశిస్తూ, నిరాశ చెందకుండా ఉన్నంత కాలం, నేను నీ పాపాలను కప్పివేస్తాను, వాటిని తుడిచి వేస్తాను, మరియు దానిని పట్టించుకోను, ఈ పాపాలు మరియు అవిధేయత పెద్ద పాపాలలో (కబాఇర్ లలో) ఒకటి అయినప్పటికీ, "ఓ ఆదమ్ కుమారుడా! నీ పాపాలు ఆకాశాలకు భూమికి మధ్య ఉన్న అంతరాన్ని నింపేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; దాని చివరలను మరియు దాని వివిధ భాగాలను కప్పివేసేటంత ఎక్కువగా ఉన్నప్పటికీ; నీవు క్షమించమని నన్ను వేడుకుంటే, నేను వాటినన్నింటినీ చెరిపివేస్తాను మరియు నీ కొరకు వాటన్నింటినీ క్షమిస్తాను, అవి సంఖ్యలో ఎంత ఎక్కువగా ఉన్నా పట్టించుకోను.”
ఓ ఆదము కుమారుడా! నీవు మరణానంతరం భూమి మొత్తం నిండి పోయేవన్ని పాపాలు మరియు అతిక్రమణలతో నా దగ్గరకు వచ్చినా; నీవు నాతో “షిర్క్” నకు పాల్బడకుండా (దేనినీ నాకు సమానంగా, నాకు సాటిగా, భాగస్వామిగా నిలబెట్టకుండా) “మువహ్హిద్”గా (ఏకదైవారాధనవాదిగా) మరణించినట్లయితే, నేను మొత్తం భూమిని నింపివేసేటంత క్షమాపణతో ఈ పాపాలు మరియు అతిక్రమణలను కలుసుకుంటాను; ఎందుకంటే నేను క్షమాపణలో అత్యంత విస్తృతమైన వాడిని మరియు “షిర్క్”ను తప్ప (బహుదైవారాధన తప్ప) అన్ని పాపాలను క్షమిస్తాను.

من فوائد الحديث

  1. సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క కరుణ, క్షమాగుణం మరియు ఆయన ఘనత మహా విస్తృతమైనవి.
  2. ఇందులో ‘తౌహీద్’ (కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట – ఏకదైవారాధన) యొక్క ఘనత, మరియు ఎవరైతే ‘తౌహీదు’ను అంటిపెట్టుకుని ఉంటారో అటువంటి ‘మువహ్హిద్’ల (కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించే వారి) పాపాలను అల్లాహ్ క్షమిస్తాడని తెలియుచున్నది.
  3. బహుదైవారాధన ఎంత ప్రమాదకరమైనదో తెలియుచున్నది. అల్లాహ్ అటువంటి బహుదైవారాధకులను క్షమించడు.
  4. ఇమాం ఇబ్న్ రజబ్ ఇలా అన్నారు: ఈ హదీథులో పాప క్షమాపణ పొందటానికి మూడు మార్గాలు ఉన్నాయి: మొదటిది: పాప క్షమాపణ కొరకు ఆపేక్షతో దుఆ చేయుట, రెండవది: క్షమాపణ కొరకు వేడుకొనుట మరియు పశ్చాత్తాప పడుట; మూడవది: ‘తౌహీద్’ పైనే మరణించడం.
  5. ఈ హదీథు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు నుండి ఉల్లేఖించిన హదీథులలో ఒకటి, దీనిని ‘అల్ హదీథ్ అల్ ఖుద్సీ’ లేదా ‘దైవప్రేరితమైన హదీథ్' అంటారు. ‘హదీథ్ అల్ ఖుద్సీ’ యొక్క పదాలు మరియు అర్థము అల్లాహ్ తరఫు నుండి అయి ఉంటాయి. ఇది దైవప్రేరితం అయినప్పటికీ, ఖుర్’ఆన్’ను వేరే ఏ ఇతర గద్యము, వచనము, గ్రంథము నుండి వేరు చేసే ప్రత్యేకతలను హదీథ్ అల్ ఖుద్సీ కలిగి ఉండదు. ఉదాహరణకు ఖుర్’ఆన్ పఠనము అనేది ఒక ఆరాధన (ఇబాదత్); ఖుర్’ఆన్ ను చేతులలోనికి తీసుకుని పఠించుట కొరకు విధిగా ఉదూ చేసి ఉండాలి. ఖుర్’ఆన్ ప్రపంచం మొత్తానికి ఒక సవాలు; ఖుర్’ఆన్ యొక్క ప్రత్యేకతలలో దాని అద్భుతత్వం కూడా ఒకటి. ఇంకా ఇటువంటి అనేక ప్రత్యేకతలను ఖుర్’ఆన్ కలిగి ఉంది.
  6. పాపాలు మూడు రకాలు:
  7. మొదటిది: “షిర్క్” - అంటే, అల్లాహ్’కు సమానులుగా, సాటిగా, ఆయనకు భాగస్వాములుగా ఎవరినైనా నిలబెట్టడం, వారిని ఆరాధించడం. అల్లాహ్ దీనిని క్షమించడు. దివ్య ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: “ఇన్నహు, మన్’ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నహ్” (వాస్తవానికి ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా చేసేవారికి, ముమ్మాటికి అల్లాహ్‌ స్వర్గాన్ని నిషేధించాడు) (సూరహ్ అల్ మాఇదహ్ 5:72).
  8. రెండవది: దాసుడు తనకు తన ప్రభువుకు మధ్య పాపాలకు, అతిక్రమణలకు పాల్బడి తనపై తానే దౌర్జన్యం చేసుకుంటాడు. అల్లాహ్ తాను తలచిన వారి కొరకు ఈ పాపాలను, అతిక్రమణలను క్షమిస్తాడు మరియు వాటిని పట్టించుకోడు, ఉపేక్షిస్తాడు.
  9. మూడవది: అల్లాహ్ ఏ ఒక్క దానినీ విడిచి పెట్టని పాపాలు. అవి దాసులు ఒకరిపై నొకరు దౌర్జన్యానికి, అన్యాయానికి పాల్బడడం. దీని కొరకు షరియత్ విధించే ‘ఖిసాస్’ (ప్రతీకారం, ప్రతిచర్య, శిక్ష) అనివార్యము.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الصربية الرومانية المجرية الموري Малагашӣ Канада الجورجية المقدونية
అనువాదాలను వీక్షించండి
ఇంకా