عَنْ عُقْبَةَ بْنِ عَامِرٍ رضي الله عنه قَالَ:
قُلْتُ: يَا رَسُولَ اللهِ مَا النَّجَاةُ؟ قَالَ: «امْلِكْ عَلَيْكَ لِسَانَكَ، وَلْيَسَعْكَ بَيْتُكَ، وَابْكِ عَلَى خَطِيئَتِكَ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2406]
المزيــد ...
ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ అల్ జుహనీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్! “అల్-నజాహ్” (విముక్తి, మోక్షము, విమోచనము మొ.) అంటే ఏమిటి?” అని. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీ నాలుకను అదుపులో ఉంచుకో; ఇంటి పట్టునే ఉండు; మరియు నీ పాపముల పట్ల దుఃఖించు” అన్నారు.
[దృఢమైనది] - - [سنن الترمذي - 2406]
ఉఖబహ్ బిన్ ఆమిర్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ లోకము నందు మరియు పరలోకము నందును ఒక విశ్వాసి మోక్షము పొందే మార్గములు ఏమిటి అని ప్రశ్నించినారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “దానికి నీవు మూడు విషయాలు ఆచరించాలి”
“మొదటిది: చెడు విషయాలు మాట్లాడుట నుండి, కీడు కలిగించే విషయాలు పలుకుట నుండి నీ నాలుకను అదుపులో ఉంచుకో, (నీ నాలుకతో) మంచి తప్ప మరేమీ మాట్లాడకు.”
“రెండవది: నీ ఏకాంతములో అల్లాహ్’ను ఆరాధించుట కొరకు (ఎక్కువగా) ఇంటి పట్టునే ఉండు; సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు విధేయత చూపే కార్యాలలో నిన్ను నీవు నిమగ్నం చేసుకో; (ప్రాపంచిక) ప్రలోభాలనుండి, ఆకర్షణల నుండి నిన్ను నీవు వేరు చేసుకో”;
“మూడవది: నీవు చేసిన పాపాల పట్ల దుఃఖపడు, విచారపడు మరియు పశ్చాత్తాపపడు.”