عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا:
أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ وَهُوَ عَلَى المِنْبَرِ، وَذَكَرَ الصَّدَقَةَ، وَالتَّعَفُّفَ، وَالمَسْأَلَةَ: «اليَدُ العُلْيَا خَيْرٌ مِنَ اليَدِ السُّفْلَى، فَاليَدُ العُلْيَا: هِيَ المُنْفِقَةُ، وَالسُّفْلَى: هِيَ السَّائِلَةُ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1429]
المزيــد ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగ వేదిక (మెంబరు) పై ఉన్నప్పుడు దానధర్మాలను గురించి మరియు ప్రజలను బిచ్చమెత్తకుండా ఉండుటను గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: "పైచేయి క్రింది చేయి కంటే మంచిది; పైచేయి దానం చేసే చేయి, మరియు క్రింది చేయి యాచించే చేయి."

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 1429]

వ్యాఖ్యానము

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చేస్తూ దానధర్మాలు చేయడాన్ని గురించి మరియు భిక్షాటన నుంచి దూరంగా ఉండటం గురించి ప్రస్తావించారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “అడుక్కునే కింది చేయి కంటే (అల్లాహ్ మార్గంలో) ఇచ్చే మరియు ఖర్చు చేసే పైచేయి అల్లాహ్’కు ఎంతో ఇష్టమైనది మరియు ప్రియమైనది.”

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. ఈ హదీథు దానధర్మాలు చేయడాన్ని మరియు (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేయడం యొక్క గుణాన్ని మరియు భిక్షాటనను ఖండించడాన్ని నొక్కి వక్కాణిస్తున్నది.
  2. ఇది యాచించడం మానేయడాన్ని మరియు ప్రజలపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఉత్తమ ఆచరణలను ప్రోత్సహిస్తుంది మరియు నీచమైన వాటిని విడిచిపెట్టమని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే అల్లాహ్ ఉత్తమ ఆచరణలనే ప్రేమిస్తాడు.
  3. నాలుగు రకాల చేతులు ఉన్నాయి, ఘనతల పరంగా అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: దానం చేసే చేయి అత్యున్నతమైనది, దాని తరువాత దానాన్ని తీసుకోకుండా ఉండే చేయి, దాని తరువాత అడగకుండా వచ్చిన దానిని స్వీకరించే చేయి, మరియు దాని తరువాత యాచించే చేయి.
అనువాదాలను చూపించండి
భాష: الإنجليزية الأوردية الإسبانية ఇంకా (37)
ఇంకా