హదీసుల జాబితా

“బంధుత్వపు సంబంధాలను నిలబెట్టేవాడు అంటే తన బంధువులు చేసిన మేలుకు ప్రతిఫలం ఇచ్చేవాడని కాదు; కానీ, తనతో బంధుత్వపు బంధాన్ని తెంచుకున్న బంధువులతో సత్సంబంధాలు కొనసాగించేవాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదము కుమారుడా! (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయబడుతుంది (అంటే అల్లాహ్ నీపై ఖర్చు చేస్తాడు, ప్రసాదిస్తాడు అని అర్థము)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతులలో, (మీ) సంభోగమును ఆమోదయోగ్యం (హలాల్) చేయు షరతులు నెరవేర్చుటకు అర్హమైనవి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైనా అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తూ తన కుటుంబంపై ఖర్చు చేస్తాడో, అది అతని కొరకు (అల్లాహ్ మార్గములో చేసిన) సత్కార్యముగా నమోదు చేయబడుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఖజా’ (అల్ ఖజా – الْقَزَعِ) చేయుటను నిషేధించినారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు “ఖుత్బతుల్ హాజహ్” నేర్పించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా ఈ ప్రపంచం మధురమైనది మరియు పచ్చనైనది (సుందరమైనది); మరియు నిశ్చయంగా అల్లాహ్ (మీ సమయములో) మిమ్ములను అందులో (ప్రపంచములో) వారసులుగా చేసినాడు – మీరు ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. కనుక ఈ ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి, మరియు స్త్రీలపట్ల కూడా జాగ్రత్తగా ఉండండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
నిశ్చయంగా నా ఉమ్మత్ లోని మగవారి కొరకు ఈ రెండూ హరాం (నిషేధము), వారి ఆడవారి కొరకు అనుమతించబడినవి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ