عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«أَكْمَلُ الْمُؤْمِنِينَ إِيمَانًا أَحْسَنُهُمْ خُلُقًا، وَخَيْرُكُمْ خَيْرُكُمْ لِنِسَائِهِمْ».
[حسن] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن الترمذي: 1162]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“మీలో, విశ్వాసములో అత్యుత్తముడు ఎవరంటే, ఎవరైతే అత్యుత్తమమైన నడవడిక కలవాడో. అలాగే మీలో అత్యుత్తమములు ఎవరంటే, ఎవరైతే తమ స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తారో”.
[ప్రామాణికమైనది] - - [سنن الترمذي - 1162]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – విశ్వాసములో సంపూర్ణత కలిగిన విశ్వాసి ఎవరంటే, ఉత్తమ వ్యక్తిత్వము, శీల సంపద కలిగిన వాడు, చిరునవ్వుతో ప్రకాశవంతమైన ముఖము కలిగినవాడు, సత్కార్యములు చేయువాడు, అందరితో మంచిగా సంభాషణ చేయువాడు, కీడు మరియు చెడులనుండి దూరంగా ఉండేవాడు – అని తెలియ జేస్తున్నారు.
అలాగే విశ్వాసులలో ఉత్తముడు ఎవరంటే ఎవరైతే తన స్త్రీలతో ఉత్తమంగా ఉంటాడో అన్నారు, అంటే ఉదాహరణకు తన భార్యలతో, కూతుళ్ళతో, తన అక్కలు, చెల్లెళ్ళతో మరియు తన బంధువులలోని స్త్రీలతో. ఎందుకంటే వీరంతా – ఉత్తమంగా వ్యవహరించడానికి మిగతా వారి కంటే ముందు అర్హులు.