عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «كان رجل يُدَايِنُ الناس، وكان يقول لفَتَاه: إذا أَتَيْتَ مُعْسِرًا فَتَجَاوَزْ عنه، لعَلَّ الله أن يَتَجَاوَزَ عنَّا، فَلَقِيَ الله فتَجَاوز عنه».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబుహురైర రజియల్లాహు అన్హు మర్ఫూ ఉల్లేఖనం ‘ఒకవ్యక్తి ప్రజలకు రుణాలు ఇస్తూ ఉండేవాడు,తన సేవకులకు ఆదేశిస్తూ చెప్పేవాడు ‘మీరు అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి వద్దకి వెళ్లినప్పుడు అతన్ని క్షమించి వదిలేయండి,బహుశా అల్లాహ్ తఆలా మనల్ని కూడా క్షమించి వదిలేస్తాడు,అతను అల్లాహ్ ను కలిసినప్పుడు అతని తప్పులన్నీఅల్లాహ్ క్షమించి ప్రక్షాళిస్తాడు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

హదీసు అర్ధం: "كان رجُلٌ يُدَايِنُ النَّاس") ఒక వ్యక్తి ప్రజలకు రుణాలు ఇస్తూ ఉండేవాడు-అంటే జనులకు రుణాన్నిఅప్పు ఇస్తూ ఉండేవాడు లేక వస్తువుల అమ్మకం అప్పు ఇస్తూ చేస్తూ ఉండేవాడు,అతను జనుల వద్ద అప్పును వసూలు చేసే తన సేవకునితో చెప్పేవాడు: నువ్వు ఏ బాఖీదారుడి దగ్గరకి వెళ్తున్నావో అతని వద్ద అప్పు తీర్చుటకు తగిన మూల్యం లేక చేల్లించనట్లైతే ("فَتَجَاوَزْ عنه") నువ్వు అతన్ని క్షమించు:అతనికి ఇంకా సమయం కేటాయించు లేదా వసూలు చేయడంలో బలవంత పెట్టవద్దు లేదా అతని వద్ద ఉన్నది స్వీకరించు అదికొంచమైనా సరే,"لعَلَّ الله أن يَتَجَاوَزَ عنَّا": బహుశా అల్లాహ్ తఆలా అంటే వారి దాసులను క్షమించినందుకు,వారిపట్ల మృదువైఖరి అవలభించినందుకు,వారి కష్టాన్ని దూరం చేసినందులకు అల్లాహ్ కూడా మనల్ని క్షమించవచ్చు,అతను ఇలా చేయడానికి గల కారణం నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల పట్ల ఉన్నతంగా వ్యవహరించిన తీరును బట్టి తిరిగి వారికి ఆ కర్మలకనుగుణంగా ప్రతిఫలం నొసగుతాడన్న విషయం మరియు అల్లాహ్ అత్యుత్తమ వైఖరి అవలంబించినవారి ఫలాన్నివృధా చేయడన్న విషయం అతనికి చాలా బాగా తెలుసు.{"فَلَقِيَ الله فتَجَاوز عنه") వాస్తవంగా అతను అల్లాహ్ ను కలిసినప్పుడు అతను జనుల పట్ల చూపిన దయా వారిపట్ల చూపిన మృదువైఖరి మరియు వారి సమస్యను సులభం చేయడం వల్ల ప్రతిఫలంగా క్షమించబడుతుంది.అది తప్ప మరే సత్కార్యం అతను ఆచరించలేదని ‘ఇబ్ను హిబ్బాన్ మరియు నసాయి గ్రంధం లోని ఈ హదీస్ తెలుపుతుంది: ఒక వ్యక్తి ఉండేవాడు అతను జీవితంలో ఏ సత్కార్యం చేయలేదు కానీ ప్రజలకు అప్పులిస్తూ ఉండేవాడు,వసూలుకు పంపే సేవకుడితో చెప్పేవాడు : అతని వద్ద ఉన్నది తీసుకో,క్లిష్టమైనది వదిలేయి వీలైతే క్షమించు,బహుశా మహోన్నతుడైన అల్లాహ్ మనల్ని కూడా క్షమిస్తాడు,అతను అలా అల్లాహ్ పై సత్భావనను ఏర్పర్చుకుని మహోన్నతుడైన అల్లాహ్ దాసుల పట్ల ఉత్తమ వైఖరి అవలంబించాడు కాబట్టి అల్లాహ్ అతని తప్పిదాలను క్షమించాడు,ఒక జాబితా ఉంది : { والجزاء من جنس العمل } పనికి తగ్గట్టుగా ప్రతిఫలం లభిస్తుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. మంచిని భోదించి కూడా పుణ్యాన్ని పొందవచ్చు, దాన్ని ఒకవేళ స్వయంగా అతను చేయకపోయిన సరే!
  2. గతించిన జాతుల ధర్మం ఒకవేళ మన ధర్మ శాసనాలని విభేదించని ఎడల మన కొరకు కూడా ఆ శాసనాలు ధర్మంగా పరిగణించబడుతాయి.
  3. కష్టాల్లో ఉన్నవాడికి గడువు ఇస్తూ అతని వద్ద వసూలు చేసేటప్పుడు మృదువైఖరిని అవలంభించాలని ప్రోత్సాహించబడుతుంది.
ఇంకా