عَنْ عَائِشَةَ أُمِّ المؤْمِنينَ رَضِيَ اللهُ عَنْهَا:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَجْتَهِدُ فِي الْعَشْرِ الْأَوَاخِرِ مَا لَا يَجْتَهِدُ فِي غَيْرِهِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1175]
المزيــد ...
ఉమ్ముల్ ము'మినీన్, విశ్వాసుల మాత అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”
[ప్రామాణికమైన హదీథు] - [ముస్లిం నమోదు చేసినారు:] - [సహీహ్ ముస్లిం - 1175]
రమదాన్ మాసంలోని చివరి పది రాత్రులు ప్రవేశిస్తూనే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన మరియు విధేయత యొక్క పనులలో, ఆచరణలలో ఎక్కువగా శ్రమ పడేవారు. ఆయన (స) చాలా ఎక్కువగా వివిధ రకాలైన మంచి పనులను, వివిధ రకాలైన దాతృత్వ చర్యలను చేసేవారు, రమదాన్ నెల చివరి పది రాత్రుల గొప్పతనం, మరియు ఘనత కారణంగా ఆయన (స) మిగతా ఇతర సమయాలలో ఆచరించిన దాని కంటే ఎక్కువగా ఆరాధనలను ఆచరించేవారు.