హదీసుల జాబితా

“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది
عربي ఇంగ్లీషు ఉర్దూ
“అల్లాహ్ ఇలా పలికినాడు: ఆదము కుమారుని ఆచరణలన్నీ అతని కొరకే, ఒక్క ఉపవాసం తప్ప; అది నాకొరకు, మరియు దానికి నేనే ప్రతిఫలాన్ని ఇస్తాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి
عربي ఇంగ్లీషు ఉర్దూ
, నేను నా తెగ వారి ప్రతినిధిగా ఇక్కడికి పంపబడినాను. నా తెగ బనూ సాద్ ఇబ్న్ బక్ర్ వారి సోదరుణ్ణి” అన్నాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే ‘అల్లాహ్ మార్గములో’ ఒక దినము ఉపవాసం ఉంటాడో, అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై సంవత్సరాల (దూరం) వరకు దూరం చేస్తాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఉపవాస విరమణలో త్వరపడినంత కాలం ప్రజలు శుభాన్ని కలిగి ఉంటారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి సహరీ (ఉపవాసం ప్రారంభించే ముందు చేసే) భోజనం చేసినాము. తర్వాత ఆయన నమాజ్‌ కొరకు లేచినారు. అపుడు నేను ఇలా అడిగాను: అదాన్ (నమాజు కొరకు పిలిచే పిలుపు) మరియు సహరీ మధ్య ఎంత సమయం ఉండింది? దానికి ఆయన ఇలా అన్నారు: సుమారు 50 ఆయతుల అంత (అంటే 50 ఖుర్‌ఆన్ వచనాలు పఠించే సమయమంత అని అర్థము)
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎల్లప్పుడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ నెలలో చివరి పది రోజులు ఇతికాఫ్ (మస్జిద్‌లో ఏకాంతంగా గడపడం) చేసేవారు. ఆయన మరణం వరకు ఈ సున్నతును తప్పకుండా పాటించారు. ఆయన మరణం తర్వాత ఆయన భార్యలు కూడా ఇదే విధంగా ఇతికాఫ్ కొనసాగించినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
సహరీ భోజనం తినండి, ఎందుకంటే సహరీ భుజించటంలో శుభము ఉన్నది
عربي ఇంగ్లీషు ఉర్దూ
రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం)
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైనా ఉపవాసంలో ఉండగా మర్చిపోయి తిన్నా లేదా తాగినా, అతను తన ఉపవాసాన్ని పూర్తిగా కొనసాగించాలి. ఎందుకంటే అతనికి ఆహారం, పానీయం ఇచ్చింది స్వయంగా అల్లాహ్ యే
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను ఈద్ రోజున ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)తో ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఇవి రెండు రోజులు — ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం నిషేధించారు: ఒకటి ఉపవాసాన్ని ముగించే రోజు (ఈదుల్-ఫిత్ర్), మరొకటి మీ ఖుర్బానీ నుండి తినే రోజు (ఈదుల్-అద్హా)
عربي ఇంగ్లీషు ఉర్దూ
రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీ కలలు చివరి ఏడు రాత్రులపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, ఎవరైనా ఖదర్ రాత్రిని అన్వేషిస్తూ ఉంటే, వారు దానిని చివరి ఏడు రాత్రుల్లో అన్వేషించాలి
عربي ఇంగ్లీషు ఉర్దూ
పది (రమదాన్ చివరి పది రాత్రులు) ప్రారంభమైనప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిని మేల్కొని గడిపేవారు, తన కుటుంబాన్ని కూడా లేపేవారు, తాను మరింత ఎక్కువగా (ఆరాధనలలో) శ్రమించేవారు, మరియు తన నడుము బిగించేవారు (అర్థం: పూర్తిగా ధ్యానం, ఆరాధనలలో నిమగ్నమయ్యేవారు)
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే ఎడతెరపి లేకుండా ఉపవాసం పాటిస్తారో, వారి ఉపవాసం లెక్కించ బడదు. నెలలో మూడు రోజులు ఉపవాసం పాటిస్తే, మొత్తం సంవత్సరమంతా ఉపవాసం పాటించినట్టే అవుతుంది
عربي ఇంగ్లీషు ఉర్దూ
రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు
عربي ఇంగ్లీషు ఉర్దూ