+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
أَوْصَانِي خَلِيلِي صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِثَلاَثٍ: صِيَامِ ثَلاَثَةِ أَيَّامٍ مِنْ كُلِّ شَهْرٍ، وَرَكْعَتَيِ الضُّحَى، وَأَنْ أُوتِرَ قَبْلَ أَنْ أَنَامَ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1981]
المزيــد ...

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”

[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1981]

వివరణ

ఈ హదీథులో అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: తన ప్రాణమిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారని, మరియు వాటి పట్ల తనను కట్టడి చేసినారు.
మొదటిది: ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించుట,
రెండవది: ప్రతి దినమూ రెండు రకాతులు ‘దుహా’ నమాజు ఆచరించుట,
మూడవది: నిద్రించుటకు ముందు విత్ర్ నమాజు ఆచరించుట, ఇది రాత్రి మూడవ (చివరి) భాగములో లేవలేమేమో అని భయపడుతున్న వారి కొరకు.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ జర్మన్ పష్టో అస్సామీ الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية الرومانية Малагашӣ Урумӣ
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహచరులకు వారి పరిస్థితుల గురించి మరియు వారికి ఏది సరిగ్గా సరిపోతుందో తనకు ఉన్న అవగాహన మరియు ఙ్ఞానము ఆధారంగా వివిధ సందర్భాలలో వివిధ సలహాలు ఇచ్చారు. మంచి శరీర దారుఢ్యము, బలము కలిగిన వ్యక్తికి జిహాద్’లో పాల్గొనుట ఉచితంగా ఉంటుంది; అంకిత భావంతో ఇబాదాత్ లో (ఆరాధనలలో) ఎక్కువగా గడుపుతూ ఉండే వ్యక్తికి ఇబాదాత్’లను గురించిన సలహా ఉపయుక్తమైనదిగా ఉంటుంది; అలాగే ఙ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తి, మరియు ఙ్ఞానము కలిగిన వ్యక్తికి దానికి సంబంధించిన సలహా తగినదై ఉంటుంది.
  2. ఇబ్న్ హజర్ అల్-'అస్కలానీ (రహిమహుల్లాహ్) అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ప్రకటన గురించి ఇలా అన్నారు: (ప్రతి నెలలో మూడు రోజులు ఉపవాసం ఉండటం); “ఇది హిజ్రీ మాసములోని ‘అయ్యాం అల్ బీద్’ (తెలుపు దినములు) ను సూచిస్తున్నది. అవి హిజ్రీ మాసములోని 13వ, 14వ మరియు 15వ తేదీలు.
  3. ఇబ్న్ హజర్ అల్-'అస్కలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: రాత్రి నిద్రపోవడానికి ముందు ‘విత్ర్’ నమాజు ఆచరించడం అభిలషణీయము. ఇది తాము నిద్ర లేవలేమేమో అని సందేహించే వారి కొరకు మాత్రమే.
  4. ఈ హదీథులో ఈ మూడు ఆచరణల యొక్క ప్రాముఖ్యత తెలియుచున్నది; ఎందుకంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సహబాలలో చాలా మందికి ఈ మూడు విషయాలను గురించి హితబోధ చేసినారు.
  5. ఇబ్న్ దఖీఖ్ అల్ ఈద్ (రహిమహుల్లాహ్), అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ప్రకటన గురించి ఇలా అన్నారు: (రెండు రకాతులు సలాత్ అద్’దుహా): “బహుశా ఆయన (అబూ హురైరహ్) ఈ నమాజు యొక్క ధృవీకరించబడిన కనీస సంఖ్యను పేర్కొన్నారు. అలాగే ఆయన ప్రకటన ద్వారా సలాత్ అద్’దుహా అనేది ‘ముస్తహబ్’ (సున్నత్, లేక సిఫారసు చేయబడినది) అని తెలియుచున్నది. దీని యొక్క రకాతుల కనీస సంఖ్య రెండు రకాతులు.
  6. అద్ దుహా నమాజు యొక్క సమయం: ఇది సూర్యోదయం నుండి దాదాపు 15 నిమిషాల తర్వాత ప్రారంభమవుతుంది మరియు దాని సమయం జుహ్ర్ సలాహ్ కు పది నిమిషాల ముందు వరకు ఉంటుంది. ఈ సలాహ్ యొక్క రకాతుల సంఖ్య: దీని కనిష్ఠ సంఖ్య రెండు అయినప్పటికీ, గరిష్ఠానికి సంబంధించి ధర్మపండితుల అభిప్రాయాలలో వ్యత్యాసం ఉంది. ఒక అభిప్రాయం ప్రకారం దీని రకాతుల సంఖ్య ఎనిమిది; మరొక అభిప్రాయం ప్రకారం దీని రకాతుల సంఖ్యకు సంబంధించి గరిష్ట పరిమితి లేదు.
  7. విత్ర్ సమయం: ఇషా సలాహ్ ముగిసిన తరువాత నుండి మొదలుకుని ప్రాతఃకాల సమయం వరకు ఉంటుంది. దీని రకాతుల కనిష్ట సంఖ్య ఒక రకాతు, గరిష్ట సంఖ్య పదకొండు రకాతులు.
ఇంకా