عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«تَحَرَّوْا لَيْلَةَ القَدْرِ فِي الوِتْرِ مِنَ العَشْرِ الأَوَاخِرِ مِنْ رَمَضَانَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2017]
المزيــد ...
ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
రమదాన్ చివరి పది దినాలలోని బేసి రాత్రుల్లో లైలతుల్-ఖదర్ రాత్రిని అన్వేషించండి.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 2017]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైలతుల్ ఖదర్ ను అన్వేషించడంలో, మంచి పనులను అధికం చేయడంలో, పశ్చాత్తాప పడుతూ తౌబా చేయడంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలని ప్రోత్సహించారు. ఈ రాత్రి ప్రతి సంవత్సరం రమదాన్ చివరి పది రోజులలోని బేసి రాత్రుల్లో (21, 23, 25, 27, 29వ రాత్రులు) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.