عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ يَقُمْ لَيْلَةَ الْقَدْرِ إِيمَانًا وَاحْتِسَابًا غُفِرَ لَهُ مَا تَقَدَّمَ مِنْ ذَنْبِهِ»
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 35]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 35]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘లైలతుల్ ఖద్ర్’ లో అల్లాహ్ యొక్క ఆరాధనలలో గడపడం యొక్క ఘనతను తెలియ జేస్తున్నారు. అది రమజాన్ నెల ఆఖరి పది రాత్రులలో వస్తుంది. ఎవరైతే ఆ రాత్రి యందు ప్రదర్శనా బుద్ధి లేకుండా, పేరుప్రఖ్యాతుల కొరకు కాకుండా, శ్రధ్ధగా నమాజులలో, ఖుర్’ఆన్ పారాయణంలో, అల్లాహ్ ధ్యానములో మరియు ఆయనను వేడుకొనుటలో; ఆ రాత్రి యొక్క ఘనతను విశ్వసిస్తూ మరియు ఆ రాత్రి గురించి ఏమి అవతరించబడినదో దానిలో పూర్తి విశ్వాసముతోను; మరియు అందుకు గానూ అల్లాహ్ ప్రసాదించే పుణ్యఫలంపై ఆశతోనూ గడుపుతాడో, అటువంటి వాని పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.