عَنْ عَبْدِ اللهِ بْنِ مُغَفَّلٍ رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ صلى الله عليه وسلم:
«بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلَاةٌ، بَيْنَ كُلِّ أَذَانَيْنِ صَلَاةٌ» ثُمَّ قَالَ فِي الثَّالِثَةِ: «لِمَنْ شَاءَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 627]
المزيــد ...
అబ్దుల్లాహ్ బిన్ ముఘఫ్ఫల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 627]
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ప్రతి అదాన్ మరి ఇఖామత్’ల మధ్య నఫీల్ నమాజు ఉన్నది. ఈ విషయాన్ని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు పునరావృతం చేసినారు. మూడవసారి – ఎవరైతే అదాన్ మరియు ఇఖామత్ లమధ్య నమాజు చదవాలుకుంటున్నారో ఇది వారి కొరకు - అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సూచించినారు.