హదీసుల జాబితా

“ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుహ్ర్ సలాహ్ కు ముందు నాలుగు (రకాతులు), మరియు ఫజ్ర్ సలాహ్’కు ముందు రెండు రకాతులు నమాజు ఆచరించడాన్ని ఎన్నడూ విడిచి పెట్టలేదు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే జుహ్ర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు, మరియు జుహ్ర్ నమాజు తరువాత నాలుగు రకాతులు నిరంతరం ఆచరిస్తాడో, అల్లాహ్ అతడిపై నరకాన్ని నిషేధించినాడు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య (అదాన్ మరియు ఇఖామత్ ల మధ్య) నమాజు ఉన్నది; నమాజు కొరకు ఇవ్వబడే రెండు పిలుపులకు మధ్య నమాజు ఉన్నది” తరువాత మూడవసారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఎవరైతే చదవాలనుకుంటున్నారో వారి కొరకు” అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ