عَنْ أَبِي قَتَادَةَ السَّلَمِيِّ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِذَا دَخَلَ أَحَدُكُمُ الْمَسْجِدَ فَلْيَرْكَعْ رَكْعَتَيْنِ قَبْلَ أَنْ يَجْلِسَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 444]
المزيــد ...
అబీ ఖతాదా అస్’సలమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 444]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధిస్తున్నారు – ఎవరైనా ఏ సమయములోనైనా, ఎందుకొరకైనా మస్జిదుకు వచ్చి అందులోనికి ప్రవేశించినట్లయితే, అతడు మస్జిదులో కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు ఆచరించాలి - ఆ రెండు రకాతుల నమాజు ‘తహియ్యతుల్ మస్జిద్’ (మస్జిదునకు గౌరవ సూచకంగా చేయబడే నమాజు) అనబడుతుంది.