عَنْ أَبِي حُمَيْدٍ أَوْ عَنْ أَبِي أُسَيْدٍ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِذَا دَخَلَ أَحَدُكُمُ الْمَسْجِدَ فَلْيَقُلِ: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ فَلْيَقُلِ: اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 713]
المزيــد ...
అబీ ఉసైద్ ఉల్లేఖించిన హదీసును అబీ హుమైద్ ఇలా తెలిపినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 713]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోనికి ప్రవేశించే ముందు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక) వైపునకు ముస్లిం సమాజాన్ని మార్గదర్శనం చేస్తున్నారు. అతడు మస్జిదులోనికి ఆరాధన (ఇబాదత్) కొరకు ప్రవేశించడానికి ముందు అతడు తన ప్రభువు యొక్క కరుణ కొరకు దువా చేస్తున్నాడు. అలాగే అతడు మస్జిదు నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నపుడు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్’లిక) వైపునకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ దుఆ పలుకడం ద్వారా అతడు తనకు ధర్మబద్ధమైన ఉపాధి కొరకు, అందులో అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని, దయను, కనికరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.