عَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ رضي الله عنه:
أَنَّ عُثْمَانَ بْنَ عَفَّانَ أَرَادَ بِنَاءَ الْمَسْجِدِ فَكَرِهَ النَّاسُ ذَلِكَ، وَأَحَبُّوا أَنْ يَدَعَهُ عَلَى هَيْئَتِهِ، فَقَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ: «مَنْ بَنَى مَسْجِدًا لِلهِ بَنَى اللهُ لَهُ فِي الْجَنَّةِ مِثْلَهُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 533]
المزيــد ...
మహ్’మూద్ బిన్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును (మస్జిద్-ఎ-నబవీను) పునర్నిమించాలని అనుకున్నారు. కానీ ప్రజలు అలా చేయడాన్ని ఇష్టపడలేదు. వారు మస్జిదు యధాతథ స్థితిలోనే ఉండాలని కోరుకున్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను – “ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 533]
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు మస్జిద్-ఎ-నబవీ ని, ఉన్న స్థితిలో కంటే ఉత్తమంగా పునర్నిర్మించాలని సంకల్పించినారు. దానికి ప్రజలు ఇష్టపడలేదు, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో నిర్మించబడిన మస్జిదు అసలు నిర్మాణములో మార్పులు వస్తాయని. (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో) మస్జిదు మట్టితో నిర్మించబడింది, దాని కప్పు సున్నపు రాయితో కట్టబడింది. అయితే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు రాతితో మరియు ప్లాస్టరుతో నిర్మించాలని తలపోసినారు. ప్రజల అయిష్టతను గమనించి, ఆయన వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా తాను విన్నానని తెలియజేసినారు – “ఎవరైతే కేవలం అల్లాహ్ యొక్క కరుణ కొరకు, కపటత్వం గానీ లేక కీర్తి కండూతి గానీ లేకుండా, మస్జిదును నిర్మిస్తారో అల్లాహ్ వారు చేసిన పనిని పోలిన అత్యుత్తమమైన దానిని అతనికి ప్రసాదిస్తాడు; ఈ విషయానికి సంబంధించి ఆ అత్యుత్తమమైనది ఏమిటంటే అల్లాహ్ స్వర్గములో దానిని పోలిన అత్యుత్తమ ఇంటిని అతని కొరకు నిర్మిస్తాడు.