عن أنس بن مالك رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«مَنْ نَسِيَ صَلَاةً فَلْيُصَلِّ إِذَا ذَكَرَهَا، لَا كَفَّارَةَ لَهَا إِلَّا ذَلِكَ: {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14]».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 597]
المزيــد ...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎవరైనా సలాహ్ ఆచరించవలసి ఉందన్న విషయాన్ని మరిచిపోయినట్లయితే, అతడు తనకు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ సలాహ్ ను ఆచరించాలి. ఇది తప్ప దీనికి పరిహారము లేదు. {وَأَقِمِ الصَّلاةَ لِذِكْرِي} [طه: 14] (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14):”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 597]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైనా విధిగా ఆచరించవలసిన నమాజులలో ఏదైనా నమాజును దాని సమయం దాటిపోయేంత వరకు ఆచరించుట మరిచిపోతే, అతడు గుర్తుకు వచ్చిన వెంటనే ఆ నమాజును (ఖజా నమాజుగా) ఆచరించుటకు ఉపక్రమించాలి. ఆ విధంగా పూర్తి చేయకుండా మిగిలి పోయిన నమాజును గుర్తుకు వచ్చిన వెంటనే ఆచరించుట తప్ప, ఒక ముస్లిము ఆ నమాజును సమయం మించిపోయేంత వరకు మరిచిపోవటం (అలక్ష్యము) వలన జరిగిన పాపము అతని నుండి తొలగిపోవుట, లేదా కప్పివేయబడుట జరుగదు. అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఇలా ఆదేశించినాడు: {… وَأَقِمِ ٱلصَّلَوٰةَ لِذِكْرِىٓ} (మరియు నన్ను స్మరించుట కొరకు నమా'జ్‌ను స్థాపించు.) [సూరహ్ తాహా 20:14): అంటే, విధిగా ఆచరించవలసిన నమాజులలో దేనినైనా ఆచరించుట మరిచిపోతే, గుర్తుకు వచ్చిన వెంటనే అల్లాహ్ ను స్మరించుటకొరకు ఆ నమాజు స్థాపించుట కూడా విధి అని అర్థము.