عن بريدة بن الحصيب رضي الله عنه أنه قال:
بَكِّرُوا بِصَلَاةِ الْعَصْرِ، فَإِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «مَنْ تَرَكَ صَلَاةَ الْعَصْرِ فَقَدْ حَبِطَ عَمَلُهُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 553]
المزيــد ...
బురైదహ్ ఇబ్న్ అల్ హసీబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“సలాతుల్ అస్ర్’ను (అస్ర్ నమాజును) ఆచరించుటలో త్వరపడండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 553]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అస్ర్ నమాజును, ఉద్దేశ్యపూర్వకంగా, దాని నిర్ధారిత సమయాన్ని మించి ఆలస్యం చేయుటను గురించి హెచ్చరిస్తున్నారు. ఎవరైతే అలా చేస్తాడు, అతడు తన ఆచారణలను వ్యర్థం చేసుకున్న వాడు అవుతాడు, నిర్మూలించుకున్న వాడవుతాడు.