عَنْ كَعْبِ بْنِ عُجْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مُعَقِّبَاتٌ لَا يَخِيبُ قَائِلُهُنَّ -أَوْ فَاعِلُهُنَّ- دُبُرَ كُلِّ صَلَاةٍ مَكْتُوبَةٍ، ثَلَاثٌ وَثَلَاثُونَ تَسْبِيحَةً، وَثَلَاثٌ وَثَلَاثُونَ تَحْمِيدَةً، وَأَرْبَعٌ وَثَلَاثُونَ تَكْبِيرَةً».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 596]
المزيــد ...
కాబ్ బిన్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు :
“నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 596]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను స్మరించడానికి పలుకవలసిన కొన్ని పదాలను గురించి తెలియజేసారు. వాటిని ఉచ్ఛరించే వాడు ఏమీ కోల్పోడు, మరియు దేనికీ చింతించడు; పైగా వాటిని ఉచ్ఛరించినందుకు అతడు ప్రతిఫలాన్ని పొందుతాడు. వాటిలో కొన్ని విషయాల తరువాత కొన్ని వస్తాయి. ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత ఉచ్చరించబడతాయి. అవి:
“సుబ్’హానల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి.
(దాని అర్థము: అల్లాహ్ పరమ పవిత్రుడు, లోపములకు, కొరతలకు అతీతుడు)
“అల్’హదులిల్లాహ్” అని ముప్పైమూడు సార్లు పలకాలి.
(దాని అర్థము: సకల స్తోత్రములు, పొగడ్తలు కేవలం అల్లాహ్ కొరకే అని, అంటే ఇందులో అల్లాహ్‌ను పూర్తి పరిపూర్ణతతో వర్ణించడంతో పాటు ఆయనను ప్రేమించడం మరియు కీర్తించడం అన్నీ కలిసి ఉంటాయి)
“అల్లాహు అక్బర్” అని ముప్పైనాలుగు సార్లు పలకాలి.
(దాని అర్థము: అల్లాహ్ అందరి కంటే, అన్నిటి కంటే గొప్పవాడు, మహోన్నతుడు, మరియు అన్నింటికన్నా శక్తివంతమైనవాడు)