ఉప కూర్పులు

హదీసుల జాబితా

“పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”
عربي ఇంగ్లీషు ఉర్దూ
మీలో ఎవరైనా రాత్రి నిద్రపోయినపుడు, అతడి తలవెనుక షైతాను మూడు ముళ్ళు వేసి, ప్రతి ముడిని తట్టుతూ ఇలా అంటాడు “ఇంకా చాలా రాత్రి ఉంది, పడుకో
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”
عربي ఇంగ్లీషు ఉర్దూ