عَنْ أَبِي مُوسَى رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَثَلُ الَّذِي يَذْكُرُ رَبَّهُ وَالَّذِي لاَ يَذْكُرُ رَبَّهُ، مَثَلُ الحَيِّ وَالمَيِّتِ»، ولفظ مسلم: «مَثَلُ الْبَيْتِ الَّذِي يُذْكَرُ اللهُ فِيهِ، وَالْبَيْتِ الَّذِي لَا يُذْكَرُ اللهُ فِيهِ، مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6407]
المزيــد ...
అబూ మూసా అల్ అష్’అరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించు వాడు మరియు తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించని వాడు – వీరిరువురి ఉదాహరణ జీవించి ఉన్న మరియు మరణించిన వానికి మధ్య ఉన్న పోలిక వంటిది”; సహీహ్ ముస్లింలో ఈ హదీథు పదాలు ఇలా ఉన్నాయి: “ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగుతుందో, మరియు ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగదో, ఆ రెంటి ఉదాహరణ జీవించి ఉన్న వానికి మరియు మరణించిన వానిని పోలియున్నది”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 6407]
ఈ హదీథులో అల్లాహ్ ను స్మరించే వ్యక్తికి, స్మరించని వ్యక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మంచి రూపం కలిగి ఉండి ప్రయోజనంతో జీవించి ఉన్న వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి పోలి ఉంటుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టం చేశారు. తన ప్రభువు నామాన్ని స్మరించే వ్యక్తి బాహ్యంగా జీవనపు ప్రకాశాన్ని మరియు అంతరంగా ఙ్ఞానపు మరియు వివేకపు ప్రకాశాన్ని కలిగి ఉంటాడు; అందులో ప్రయోజనం ఉన్నది. మరియు అల్లాహ్ నామమును స్మరించని వాని పోలిక మృతుని పోలినటువంటిది. మృతుడు బాహ్యంగా కాంతి విహీనుడై ఉంటాడు, అంతరంగములో నిష్ఫలుడై, సోమరిపోతుగా ఉంటాడు; మరియు అందులో ప్రయోజనం ఏమీ ఉండదు.
అదే విధంగా, ఏ ఇంటిలోనైతే అందులో నివసించే వారు అల్లాహ్ నామ స్మరణ చేస్తూ ఉంటారో ఆ ఇల్లు సజీవమైనదిగానూ; దానికి వ్యతిరేకంగా ఉంటే అది నిర్జీవమైనదిగానూ అభివర్ణించబడింది, ఎందుకంటే అందులో నివసించేవారు అల్లాహ్ నామాన్ని స్మరించడంలో సోమరిపోతులుగా ఉంటారు గనుక. ఇందులో ఇల్లు సజీవమైనది, నిర్జీవమైనది అనే పోలిక అందులో నివసించే వారికి వర్తిస్తుంది, స్వయంగా ఇంటికి కాదు.