عَنْ أَبٍي سَعِيدٍ الخُدْرِيَّ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ جَلَسَ ذَاتَ يَوْمٍ عَلَى المِنْبَرِ وَجَلَسْنَا حَوْلَهُ، فَقَالَ: «إِنِّي مِمَّا أَخَافُ عَلَيْكُمْ مِنْ بَعْدِي، مَا يُفْتَحُ عَلَيْكُمْ مِنْ زَهْرَةِ الدُّنْيَا وَزِينَتِهَا» فَقَالَ رَجُلٌ: يَا رَسُولَ اللَّهِ، أَوَيَأْتِي الخَيْرُ بِالشَّرِّ؟ فَسَكَتَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقِيلَ لَهُ: مَا شَأْنُكَ؟ تُكَلِّمُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَلاَ يُكَلِّمُكَ؟ فَرَأَيْنَا أَنَّهُ يُنْزَلُ عَلَيْهِ؟ قَالَ: فَمَسَحَ عَنْهُ الرُّحَضَاءَ، فَقَالَ: «أَيْنَ السَّائِلُ؟» وَكَأَنَّهُ حَمِدَهُ، فَقَالَ: «إِنَّهُ لاَ يَأْتِي الخَيْرُ بِالشَّرِّ، وَإِنَّ مِمَّا يُنْبِتُ الرَّبِيعُ يَقْتُلُ أَوْ يُلِمُّ، إِلَّا آكِلَةَ الخَضْرَاءِ، أَكَلَتْ حَتَّى إِذَا امْتَدَّتْ خَاصِرَتَاهَا اسْتَقْبَلَتْ عَيْنَ الشَّمْسِ، فَثَلَطَتْ وَبَالَتْ، وَرَتَعَتْ، وَإِنَّ هَذَا المَالَ خَضِرَةٌ حُلْوَةٌ، فَنِعْمَ صَاحِبُ المُسْلِمِ مَا أَعْطَى مِنْهُ المِسْكِينَ وَاليَتِيمَ وَابْنَ السَّبِيلِ - أَوْ كَمَا قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ - وَإِنَّهُ مَنْ يَأْخُذُهُ بِغَيْرِ حَقِّهِ، كَالَّذِي يَأْكُلُ وَلاَ يَشْبَعُ، وَيَكُونُ شَهِيدًا عَلَيْهِ يَوْمَ القِيَامَةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1465]
المزيــد ...
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం :
“ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్’పై కూర్చుని ఉన్నారు. మేమంతా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కూర్చుని ఉన్నాము, అపుడు వారు ఇలా అన్నారు: “నా తరువాత, మీ గురించి నేను భయపడే వాటిలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు దాని అలంకరణ”. ఒక వ్యక్తి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఏమీ, మంచి చెడును తీసుకు వస్తుందా?” అని ప్రశ్నించాడు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోయారు. అక్కడున్నవారు అతడిని “ఏమైంది నీకు? నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతావా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడుతున్నది నీతో కాదు కదా?” అని మందలించారు. అయితే మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదో అవతరిస్తున్నట్లుగా గమనించినాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నుదుటిపై పట్టిన చెమట బిందువులను తుడిచి వేసుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ప్రశ్న అడిగినందుకు అతడిని మెచ్చుకుంటున్నట్లుగా అనిపించింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మంచి ఎప్పుడూ చెడును పుట్టించదు. నిజానికి అది నీటి ప్రవాహం ఒడ్డున పెరిగే ఒక రకం పచ్చిక లాంటిది, అది జంతువులను చంపుతుంది లేదా అనారోగ్యానికి గురి చేస్తుంది, ఒక జంతువు ఖదీరా (ఒక రకమైన కూరగాయ) తిని, ఆపై సూర్యుని వైపు తిరిగి, మలవిసర్జన చేసి, మూత్ర విసర్జన చేసి, మళ్ళీ మేస్తుంది తప్ప (తినేసి అలాగే ఉండిపోయి ప్రాణం మీదకు తెచ్చుకోదు). నిస్సందేహంగా ఈ సంపద మధురమైనది, పచ్చగా (ఆకర్షణీయంగా) ఉంటుంది. అయితే తన సంపదలో నుండి పేదవారికి, అనాథలకు, అన్నీ కోల్పోయిన ప్రయాణీకులకు దానం చేసేవాని సంపద ధన్యమైనది." లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా ఇలా అన్నారు: “నిస్సందేహంగా, దానిని (సంపదను) ధర్మవిరుద్ధంగా సంపాదించేవాడు ఎంత తిన్నప్పటికీ సంతృప్తి చెందని వానిలాంటి వాడు. మరియు అతని సంపద పునరుత్థాన దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా మారుతుంది.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1465]
ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబెర్ పై కూర్చుని తన సహాబాలతో మాట్లాడుతున్నారు, అపుడు వారు ఇలా అన్నారు:
“నేను (చని) పోయిన తరువాత, మీ గురించి నేను భయపడే విషయాలలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు అలంకారాలు, దాని ఆనందాలు – మరియు జీవితం ఎంతో స్వల్పమైనది అయినప్పటికీ ప్రజలు గొప్పగా చెప్పుకునే వస్తువులు, దుస్తులు, పంటలు మరియు ఇతర వస్తువులు.
ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాడు: “ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మొదలైనవి అల్లాహ్ తరఫు నుండి ఆయన అనుగ్రహం మరియు శుభాలు కదా! మరి ఆ శుభాలే వెనుదిరిగి శాపాలుగా, శిక్షలుగా మారుతాయా?”
దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోవడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహానికి గురయ్యారేమో అనుకుని అక్కడున్న వారు ఆ ప్రశ్నించిన వానిని మందలించారు.
తరువాత అక్కడున్న వారికి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎదో అవతరిస్తున్నది అన్న విషయం స్పష్టమై పోయింది. కొద్ది సేపటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (వహీ అవతరణ కారణంగా) తన నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు.
అతడు: “హాజరుగా ఉన్నాను ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం” అన్నాడు.
అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు ప్రశంసలు అర్పించి ఇలా అన్నారు: “నిజమైన మంచితనం మంచితనాన్ని మాత్రమే తీసుకు వస్తుంది. కానీ ఈ ప్రాపంచిక వైభవం, దాని అలంకారం, సౌదర్యము – ఇవి స్వచ్ఛమైన మంచితనం కాదు. ఎందుకంటే దాని ఆకర్షణ, ప్రలోభము, మరియు పోటీ మొదలైనవి సంపూర్ణంగా పరలోక జీవితంపై శ్రద్ధ వహించ కుండా, వాటిలోనే నిమగ్నమై పోయేలా చేస్తాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఒక ఉదాహరణ ద్వారా వివరించినారు: వసంతకాలపు మొక్కలు మరియు ఖదిర్’ని (ఇది ఒక రకమైన మొక్క, దీనిని పశువులు ఇష్టంగా తింటాయి) అధికంగా తినడం వల్ల ఆ మొక్కలు పశువులను చంపవచ్చు లేదా మృత్యువు అంచులకు చేర్చవచ్చు. దీనికి మినహాయింపు – ఖదిర్ తినే పశువు, దాని కడుపు రెండు వైపులా నిండిపోయే వరకు తిని, తరువాత అది సూర్యుని వైపునకు తిరిగి, తన కడుపు నుండి పేడని విసర్జిస్తుంది, లేదా మూత్రవిసర్జన చేస్తుంది. తరువాత అది తన కడుపులో ఉన్న దానిని పైకి తెచ్చి నెమరు వేస్తూ, నమిలిన తరువాత మింగుతుంది, తరువాత మళ్ళీ మేయడం ప్రారంభిస్తుంది.
సంపద మధురంగా, పచ్చగా ఆకర్షణీయంగా ఉండే ఒక రకమైన మొక్క లాంటిది. ఆ మొక్క ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే అది ప్రాణం తీయగలదు, లేదా దాదాపు మృత్యువు అంచుల వరకూ తీసుకు వెళ్ళగలదు. నిజానికి సంపద అవసరమైనదే. దానిని ధర్మబధ్ధమైన మార్గములో, కొద్ది మొత్తములో తీసుకుని, అవసరానికి తగినంత మాత్రమే ఉపయోగించినట్లయితే, అది అతనికి ఎటువంటి హాని కలుగజేయదు. ఒక ముస్లిం తన సంపదలో కొద్ది భాగాన్ని పేదలకు, అనాథలకు, సర్వమూ కోల్పోయిన బాటసారులకు పంచినట్లయితే (దానము చేసినట్లయితే), ఆ సంపద అతనికి ఒక మంచి సహచరునిగా మారుతుంది. ఎవరైతే సంపదను ధర్మబద్ధంగా సంపాదించి తనతో ఉంచుకుంటాడో అది అతనికి ఒక వరం లాంటిది. కానీ ఎవరైతే దానిని అధర్మంగా, అధర్మ మార్గాలలో సంపాదిస్తాడో అతడు ఎంత తిన్నా సంతృప్తి చెందని వ్యక్తి లాంటి వాడు. ఆ సంపద తీర్పు దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా నిలబడుతుంది.