+ -

عَنْ أَبِي مُسْلِمٍ الْخَوْلَانِيِّ، قَالَ: حَدَّثَنِي الْحَبِيبُ الْأَمِينُ، أَمَّا هُوَ فَحَبِيبٌ إِلَيَّ، وَأَمَّا هُوَ عِنْدِي فَأَمِينٌ، عَوْفُ بْنُ مَالِكٍ الْأَشْجَعِيُّ رضي الله عنه قَالَ:
كُنَّا عِنْدَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، تِسْعَةً أَوْ ثَمَانِيَةً أَوْ سَبْعَةً، فَقَالَ: «أَلَا تُبَايِعُونَ رَسُولَ اللهِ؟» وَكُنَّا حَدِيثَ عَهْدٍ بِبَيْعَةٍ، فَقُلْنَا: قَدْ بَايَعْنَاكَ يَا رَسُولَ اللهِ، ثُمَّ قَالَ: «أَلَا تُبَايِعُونَ رَسُولَ اللهِ؟» فَقُلْنَا: قَدْ بَايَعْنَاكَ يَا رَسُولَ اللهِ، ثُمَّ قَالَ: «أَلَا تُبَايِعُونَ رَسُولَ اللهِ؟» قَالَ: فَبَسَطْنَا أَيْدِيَنَا وَقُلْنَا: قَدْ بَايَعْنَاكَ يَا رَسُولَ اللهِ، فَعَلَامَ نُبَايِعُكَ؟ قَالَ: «عَلَى أَنْ تَعْبُدُوا اللهَ وَلَا تُشْرِكُوا بِهِ شَيْئًا، وَالصَّلَوَاتِ الْخَمْسِ، وَتُطِيعُوا -وَأَسَرَّ كَلِمَةً خَفِيَّةً- وَلَا تَسْأَلُوا النَّاسَ شَيْئًا» فَلَقَدْ رَأَيْتُ بَعْضَ أُولَئِكَ النَّفَرِ يَسْقُطُ سَوْطُ أَحَدِهِمْ، فَمَا يَسْأَلُ أَحَدًا يُنَاوِلُهُ إِيَّاهُ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1043]
المزيــد ...

అబూ ముస్లిం అల్ ఖౌలానీ ఉల్లేఖనం : “అతి ప్రియమైన మరియు విశ్వసనీయుడైన ఒక వ్యక్తి ఉన్నాడు – అతడు నాకు ప్రియమైన వాడు మరియు నేను అతడిని విశ్వసనీయునిగా భావిస్తాను – (అతడే) ఔఫ్ ఇబ్న్ మాలిక్ అల్ అష్’జఇ రజియల్లాహు అన్హు; ఆయన ఈ విధంగా పలికినారు:
ఒకసారి మేము మొత్తం తొమ్మిది మంది లేక ఎనిమిది లేక ఏడుగురము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ఉన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. నిజానికి మేము ఇటీవలనే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ప్రమాణము చేసి ఉన్నాను. కనుక మేము - “ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము కదా ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం !” అన్నాము. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమీ, అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. మేము మరలా - “మేము ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము కదా ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం !” అన్నాము. దానికి ఆయన మళ్ళీ “ఏమీ, అల్లాహ్ యొక్క సందేశహరుని చేతిపై మీరు విధేయతా ప్రమాణం చేయరా?” అన్నారు. అపుడు ఔఫ్ ఇబ్న్ మాలిక్ ఇలా అన్నారు: “మేము మా చేతులను ముందుకు చాచి, ఇలా అన్నాము “మేము ముందుగానే మీ చేతిపై ప్రమాణము చేసినాము ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ; మరి ఇపుడు ఏ విషయమై ప్రమాణం చేయాలి?” దానికి ఆయన “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించమని; ఐదు (ఫర్జ్) నమాజులను విధిగా ఆచరిస్తామని; (పాలకునికి) విధేయులుగా ఉంటామని;” తరువాత లోగొంతుతో “దేని కొరకూ ప్రజలను అర్థించము అని” అన్నారు. వాస్తవములో నేను ఇది చూసాను - (సహాబాలలో) కొంతమంది తమ చేతి నుండి కొరడా (కమ్చీ) నేలపై జారిపడినా దానిని ఎత్తి ఇవ్వమని కూడా ఎవరినీ అర్థించే వారు కాదు.”

[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 1043]

వివరణ

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొంత మంది సహచరులతో ఉన్నారు, అపుడు ఆయన తన చేతిపై విధేయతా ప్రతిజ్ఞ చేయమని మరియు కొన్ని విషయాలకు కట్టుబడి ఉంటామని వాగ్దానం చేయమని వారిని మూడుసార్లు అడిగారు:
మొదటిది: అల్లాహ్ ఆదేశించిన విషయాలను ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటి నుండి దూరంగా ఉంటూ కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించము అని;
రెండవది: పగలు మరియు రాత్రి కాలములో అల్లాహ్ విధిగావించిన ఐదు నమాజులను విధిగా ఆచరిస్తామని;
మూడవది: ముస్లిములకు మంచి జరిగే విషయాలలో మరియు వారి అభ్యున్నతికి చెందిన విషయాలలో పాలకుని మాట వింటామని మరియు అతనికి విధేయులై ఉంటామని,
నాలుగవది: తమ ప్రతి అవసరానికీ కేవలం అల్లాహ్ ను మాత్రమే అర్థిస్తామని, ప్రజలను దేని కొరకూ అర్థించము అని. ఈ మాటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లోగొంతుకలో పలికినారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహబాలు, వారు చేసిన విధేయతా ప్రమాణమును తు.చ. తప్పకుండా ఆచరించినారు. చివరికి ఈ హదీసు ఉల్లేఖకుడు ఈ విధంగా పలికినారు: కొంతమంది తమ చేతి నుండి కొరడా, చెర్నకోలా (కమ్చీ) నేలపై జారిపడినా దానిని ఎత్తి ఇవ్వమని కూడా ఎవరినీ అర్థించే వారు కాదు. వారు స్వయంగా తమ వాహనం పై నుండి (ఒంటె, గుర్రము, గాడిద మొ.) దిగి తీసుకునేవారు.”

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ థాయ్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية Қирғизӣ النيبالية Юрба الليتوانية الدرية الصربية الصومالية Кинёрвондӣ الرومانية المجرية التشيكية الموري Малагашӣ Урумӣ Канада الولوف الأوكرانية الجورجية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీసులో – ప్రజలను దేని గురించి అయినా అర్థించ రాదని, "భిక్షాటన" అని పిలవబడే దానికి చాలా దూరంగా ఉండుట; అది చాలా చిన్న విషయమైనా సరే ప్రజలను కోరకుండా ఉండుట మొదలైన వాటి పట్ల ప్రొత్సాహం ఉన్నది.
  2. ప్రజలను అభ్యర్థించుట పై నిషేధము: ఈ నిషేధము ప్రాపంచిక అవసరాలకు, ప్రాపంచిక విషయాలకు సంబంధించినది. ఙ్ఞానానికి మరియు ధర్మానికి సంబంధించిన విషయాలను తెలుసుకొనుట కొరకు అభ్యర్థించుటకు సంబంధించినది కాదు.
ఇంకా