ఉప కూర్పులు

హదీసుల జాబితా

క్రైస్తవులు మరియు యూదులపై అల్లాహ్ యొక్క శాపము ఉండుగాక, వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదుగా (ఆరాధనా గృహాలుగా) చేసుకున్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం ను క్రైస్తవులు (హద్దుమీరి) కీర్తించిన విధంగా, నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని మాత్రమే అనండి
عربي ఇంగ్లీషు ఉర్దూ
తీర్పు దినమునాడు నా మధ్యవర్తిత్వాన్ని పొందే (నా సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడు ఎవరంటే – “లా ఇలాహ ఇల్లల్లాహ్” (నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని ఎవరైతే నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
మహాపరాధలలో అతి ఘోరమైనది ‘అల్లాహ్ కు ఇతరులను భాగస్వామ్యులుగా చేయడం‘అల్లాహ్ యొక్క శక్తి నుండి బేఖాతరు చేయకపోవడం,అల్లాహ్ కారుణ్యం నుండి నిరాశ చెందడం,అల్లాహ్ యొక్క ఆత్మ నుండి నమ్మకం కోల్పోవడం.
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఒంటెల మెడలలో వేలాడదీసిన ఎటువంటి దారాన్ని గానీ, ఎటువంటి పట్టాను గానీ లేక ఎటువంటి గొలుసును గానీ త్రెంచి వేయకుండా వదలకండి” అనే ఆదేశముతో పంపినారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
ఏదైనా వస్తువు తావీజులా ఎవరైతే ధరిస్తారో దానికే అప్పగించబడతారు’.
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“పునరుథ్థాన దినమున నరకాగ్నిలో అందరికంటే తక్కువ శిక్ష విధించబడిన వ్యక్తితో అల్లాహ్ ఇలా అంటాడు: “నీ వద్ద భూమిపై ఉన్న ప్రతి వస్తువూ ఉన్నట్లైతే, వాటన్నింటినీ ఈ శిక్ష నుండి విముక్తి పొందుట కొరకు చెల్లించుకుంటావా?” అని. దానికి అతడు “అవును, చెల్లించుకుంటాను
عربي ఇంగ్లీషు ఉర్దూ
అది ఏదో ఒక నిజానికి సంబంధించిన మాట అయి ఉంటుంది. దానిని ఆ జిన్ను దొంగతనంగా (దైవదూతల నుండి) పొంది, తన మిత్రుడైన ఆ జ్యోతిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానికి (ఆ నిజమైన ఒక్క మాటకు) మరో వంద అబద్ధాలు కల్పించి చెపుతాడు.” (సహీ బుఖారీలో ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖించిన మరొక హదీసులో తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నాను అని తెలిపారు “స్వర్గములో అల్లాహ్ నిర్ణయించిన విషయాలను గురించి ప్రస్తావించుకుంటూ దైవదూతలు క్రింది ఆకాశాలలోనికి వస్తారు. వారి మాటలను జిన్ను దొంగతనంగా, చాటుమాటుగా విని తమ మిత్రులైన జ్యోతిష్యులకు చేరవేస్తాడు. అలా ఆ జ్యోతిష్యులు దానికి వంద అబద్దాలు జోడించి చెబుతూ ఉంటారు.”)
عربي ఇంగ్లీషు ఉర్దూ
“సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (సమాధి తన ఎదురుగా ఉండేలా) నమాజు ఆచరించకండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు
عربي ఇంగ్లీషు ఉర్దూ
అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“(అల్లాహ్ అనుమతి లేకుండా వ్యాపించే) ఏ “అద్వా” (అంటువ్యాధి) లేదు, అలాగే ఏ “తియరహ్” (అపశకునము) లేదు; అయితే “అల్ ఫా’ల్” ను (మంచి శకునాన్ని) నేను ఇష్టపడతాను”. ఆయన వద్ద ఉన్న వారు ప్రశ్నించారు “అల్ ఫా’ల్” అంటే ఏమిటి?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఒక మంచి మాట” అన్నారు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
మరి ఇపుడు ఏ విషయమై ప్రమాణం చేయాలి?” దానికి ఆయన “కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధిస్తామని, ఆయనకు ఎవరినీ సాటి కల్పించమని; ఐదు (ఫర్జ్) నమాజులను విధిగా ఆచరిస్తామని; (పాలకునికి) విధేయులుగా ఉంటామని;” తరువాత లోగొంతుతో “దేని కొరకూ ప్రజలను అర్థించము అని
عربي ఇంగ్లీషు ఉర్దూ
[“…..వీరి ఆరాధ్యదైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.”] (సూరహ్ అల్ ఆరాఫ్ 7:138) అన్నారు
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఏదో ఒక విషయాన్ని గురించి మాట్లాడినాడు. తరువాత అతడు ‘అల్లాహ్ మరియు మీరు కోరిన విధంగా జరుగుతుంది’ అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఏమిటీ, నువ్వు నన్ను అల్లాహ్’కు సమానుడిగా చేస్తున్నావా? ఇలా అను: “ఏకైకుడైన అల్లాహ్ కోరిన విధంగానే జరుగుతుంది.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటారో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”
عربي ఇంగ్లీషు ఉర్దూ
“మిథ్యా దైవాల పేరున (విగ్రహాల పేరున) గానీ, లేక మీ తాతలు, తండ్రుల పేరున గానీ ప్రమాణం చేయకండి (ఒట్టు పెట్టుకోకండి).”
عربي ఇంగ్లీషు ఉర్దూ