عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَمَّا خَرَجَ إِلَى حُنَيْنٍ مَرَّ بِشَجَرَةٍ لِلْمُشْرِكِينَ يُقَالُ لَهَا: ذَاتُ أَنْوَاطٍ يُعَلِّقُونَ عَلَيْهَا أَسْلِحَتَهُمْ، فَقَالُوا: يَا رَسُولَ اللهِ، اجْعَلْ لَنَا ذَاتَ أَنْوَاطٍ كَمَا لَهُمْ ذَاتُ أَنْوَاطٍ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «سُبْحَانَ اللهِ! هَذَا كَمَا قَالَ قَوْمُ مُوسَى {اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ} [الأعراف: 138] وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَتَرْكَبُنَّ سُنَّةَ مَنْ كَانَ قَبْلَكُمْ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2180]
المزيــد ...
అబూ వాఖిద్ అల్ లైసీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హునైన్ వైపునకు ప్రయాణమై బయలుదేరినపుడు దారిలో బహుదైవారాధకులు (పవిత్రమైనదిగా భావించే) “జాతు అన్వాత్” అని పిలుచుకునే ఒక వృక్షం పక్క నుండి వెళ్ళడం జరిగింది. బహుదైవారాధకులు తమ ఆయుధాలను ఆ వృక్షంపై ఉంచేవారు. అపుడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారికి “జాతు అన్వాత్” ఏవిధంగా ఉన్నదో, మాకు కూడా ఒక “జాతు అన్వాత్” ను ఏర్పాటు చేయండి”. అది విని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విస్మయంగా “సుబ్’హానల్లాహ్! ఇది సరిగ్గా ఇజ్రాయీలు సంతతి వారు మూసా (అలైహిస్సలాం) ను అడిగిన విధంగా ఉన్నది - {اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ} [الأعراف: 138] [“…..వీరి ఆరాధ్యదైవాల వలే మాకు కూడా ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.”] (సూరహ్ అల్ ఆరాఫ్ 7:138) అన్నారు.
[దృఢమైనది] - - [سنن الترمذي - 2180]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి హునైన్ కు బయలుదేరి వెళ్ళారు. అది తాయిఫ్ మరియు మక్కా నగరాల మధ్యనున్న ఒక లోయ. వారి వెంట కొత్తగా ఇస్లాం స్వీకరించి విశ్వాసులుగా మారిన సహాబాలు ఉన్నారు. దారిలో వారు “జాతు అన్వాత్” అని పిలువబడే ఒక వృక్షం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది, దానిపై వేళ్ళాడదీసిన అనేక వస్తువులున్నాయి. బహుదైవారాధకులు ఆ చెట్టును పూజించేవారు మరియు ఆశీర్వాదం కోసం వారి ఆయుధాలను మరియు ఇతర వస్తువులను దానిపై వేలాడదీసేవారు. వారు తమ ఆయుధాలను వ్రేలాడదీయడానికి, తద్వారా శుభాలను ఆశీర్వాదాలను పొందడానికి, తమ కోసం కూడా ఇలాంటి ఒక చెట్టును ఏర్పాటు చేయమని సహాబాలు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు. సహాబాలలో కొందరు ఆ విధంగా దేనినైనా ఏర్పాటు చేసుకోవడం బహుశా అనుమతించబడిన (హలాల్) విషయమేనని అనుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,వారి అభ్యర్థనను తిరస్కరిస్తూ, వారు అలా అడిగినందుకు విస్మయంగా “సుబ్’హానల్లాహ్” అన్నారు. (కొన్ని సందర్భాలలో) ఆ విధంగా అల్లాహ్ ను కొనియాడడం, స్తుతించడం ఎదుటివారి మాటలను, చర్యలను తిరస్కరించడం అవుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారి అభ్యర్థన ఇస్రాయీలు సంతతివారు మూసా అలైహిస్సలాం ను అభ్యర్థించిన దానిని పోలి ఉన్నది అని తెలియజేసారు – { ఇస్రాయీలు సంతతివారు మూసా అలైహిస్సలాం తో ఇలా అన్నారు “…..వీరి ఆరాధ్యదైవాలవలే మాకు కూడ ఒక ఆరాధ్యదైవాన్ని నియమించు.”} విగ్రహాలను ఆరాధిస్తున్న వారిని చూసి, వారు (మూసా అ.స. అనుచరులు), ఆ విగ్రహారాధకులకు మాదిరిగానే తమ కోసం కూడా ఆరాధ్య దైవాన్ని ఏర్పాటు చేయమని కోరినారు. (ఈ ఉదాహరణను ప్రస్తావించి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలు ఆవిధంగా కోరడం, నిశ్చయంగా వారిని అనుసరించడమే అని తెలియజేసినారు. అప్పుడు ప్రవక్త హెచ్చరికగా, ఈ సమాజం యూదులు మరియు క్రైస్తవుల మార్గాలను అనుసరిస్తుందని మరియు వారి చర్యలను నకలు చేస్తుందని తెలియజేసారు.