عن عمر بن الخطاب رضي الله عنه قال: سمعت النبي صلى الله عليه وسلم يقول: «لا تُطْروني كما أَطْرت النصارى ابنَ مريم؛ إنما أنا عبده، فقولوا: عبد الله ورسوله».
[صحيح] - [رواه البخاري]
المزيــد ...

ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియాల్లాహు అన్హు ఉల్లేఖిస్తూ తెలిపారు ‘నేను మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహైవ సల్లమ్ భోదిస్తుంటే విన్నాను {నసార}క్రైస్తవులు మర్యం పుత్రుడైన ఈసా విషయము లో అతిక్రమించినట్లు నా విషయం లో మీరు నా హోదా కు,(స్థాయి కి) మించి అతిశయిళ్లకండి (మితిమీరకండి),నిశ్చయంగా నేను ఒక దాసుడను మాత్రమే కాబట్టి"అల్లాహ్ దాసుడు మరియు ఆయన ప్రవక్త" అని మాత్రమే పలకండి.
దృఢమైనది - దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ తౌహీద్'వ్యాప్తి పట్ల ఆసక్తి కలిగి ఉండేవారు,గతించిన జాతులు షిర్కుకు గురైన విధంగా తన జాతి గురించి చింతించేవారు,అందువల్ల తన విషయం లో అతిశయోక్తి కి దూరంగా ఉండాలని,మరియు పొగడ్తల విషయం లో అతిశయిల్లకుండా ‘అల్లాహ్ కు ప్రత్యేకించబడిన కార్యాలను గానీ గుణగనాలను గానీ ప్రవక్తకు ఆపాదిస్తూ గతించిన జాతుల మాదిరిగా హద్దుమీరకూడదని హెచ్చరించారు అంటే “క్రైస్తవులు‘ఈసా అలైహిస్సలాం పట్ల అతిశయిల్లుతూ,హద్దుమీరుతూ,ఆయనకు దైవత్వాన్ని అంటగట్టి,అల్లాహ్కు సంతానంగా చిత్రీకరించి షిర్కు కు గురయ్యారు,ఈ విషయాన్నిఖుర్ఆన్ ద్వారా అల్లాహ్ సాక్ష్య పర్చాడు:{لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ وَقَالَ الْمَسِيحُ يَا بَنِي إِسْرَائِيلَ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ إِنَّهُ مَنْ يُشْرِكْ بِاللَّهِ فَقَدْ حَرَّمَ اللَّهُ عَلَيْهِ الْجَنَّةَ وَمَأْوَاهُ النَّارُ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنْصَارٍ}''అల్లాహ్ (అంటే)మర్యమ్ కుమారుడగు మసీహ్యే''అని చెప్పినవారు నిస్సందేహంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే.యదార్థానికి మసీహ్ వారితో ఇలా పలికాడు''ఓ ఇస్రాయీలు వంశస్థులారా!నాకూ,మీకూ ప్రభువైన అల్లాహ్నుమాత్రమే పూజించండి''ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వానికోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి.అతని నివాసం నరకాగ్ని,దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు.ఆ తరువాత తెలియజేశారు,«فإنما أنا عبده، فقولوا عبد الله ورسوله»-నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుడను మరియు మీరు పలకండి:అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని,అనగా -అల్లాహ్ చెప్పినట్లు దైవదాస్యం మరియు దైవదౌత్యం ద్వారా మాత్రమే కొనియాడండి,మీరు నా విషయం లో మితిమీరి దైవదాస్య స్థానం నుండి దైవత్వానికి లేక పోషకత్వానికి చేర్చి నసారా(క్రైస్తవులు) చేసిన తప్పును తిరిగి చేయకండి,ఎందుకంటే ప్రవక్తల యొక్క వాస్తవికత ‘దైవదాస్యము మరియు దైవదౌత్యం’మాత్రమే,దైవత్వము అది కేవలం ఏకైకుడైన అల్లాహ్’కు మాత్రమే చెందుతుంది,దీంతోపాటు కొంతమంది ప్రజలు ఏ విషయం చేయకూడదని దైవప్రవక్త వారించారో అదే విషయాన్ని ఆచరిస్తున్నారు,కాబట్టి మీరు అందులో పడకుండా జాగ్రత్త వహించండి అని హెచ్చరించబడుతుంది.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ కుర్దిష్ పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ప్రశంసలో అతిశయోక్తి మరియు మితిమీరడం పట్ల,పరిమితికి మించి మరియు అసత్యపు పొగడ్తల కు వ్యతిరేఖంగా హెచ్చరించడం జరిగింది,ఎందుకంటే అది షిర్కు వైపుకు దారితీస్తుంది,మరియు దాసుడు ప్రభువు యొక్క గొప్పస్థితిని తగ్గించి,ఆయన లక్షణాలను ఇతరులకు చేర్చి వర్ణిస్తాడు.
  2. క్రైస్తవుల అవిశ్వాసం అల్ మసీహ్ యందు మరియు ఆయన తదనంతరం సాధువులు మరియు సన్యాసుల పట్ల అతిశయిళ్లడం హద్దుమీరడం వల్ల జరిగింది,ఈసా పట్ల -ఆయన అల్లాహ్ కుమారుడు’- అనే ఈ వ్యాఖ్య గ్రంధాలను వక్రీకరించడానికి దారితీసింది తద్వారా వారి తప్పుడు వాదనల యొక్క చెల్లుబాటును రుజువు పరుచుకున్నారు.
ఇంకా