عن عبد الله بن مسعود رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: "هلك المُتَنَطِّعون -قالها ثلاثا-".
[صحيح] - [رواه مسلم]
المزيــد ...

అబ్దుల్లా బిన్ మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖిస్తున్నారు‘నిశ్చయంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు భోదించారు "అతిశయిల్లే వారికి నాశనం తప్పదూ అని మూడు సార్లు పదేపదే పలికారు"
దృఢమైనది - దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నారు : విషయాల్లో మునిగిపోవడం అందులో హద్దుమీరిపోవడం నాశనానికి దారి తీస్తుంది,దీనినుండి వారించడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం,ఆరాధనలో విపరీతంగా తమను అలసటకు గురిచేసుకోవడం వల్ల మనసు ఆరాధన పట్ల అసహ్యతకు గురి అవుతుంది,మార్గభ్రష్టత పాలవుతుంది,సంభాషణలో అతిశయిళ్లడం,అరవడం వల్ల కూడా ఇలాగే జరుగుతుంది,అయితే పాపానికి సంబంధించి అతిశయిళ్లడం లో అత్యంత పెద్దది మరియు అధికంగా జాగ్రత్త పడవలిసిన విషయం‘సత్పురుషుల పట్ల గౌరవం చూపడం- ఇందులో షిర్కు కు గురిచేసే విధంగా హద్దుమీరకూడదు.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ప్రతీ విషయం లో అతిశయోక్తి కి దూరంగా ఉండాలని ముఖ్యంగా ఆరాధన మరియు సత్పురుషుల ప్రశంసకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేయబడినది.
  2. ఉమ్మత్ రక్షణ పట్ల దైవప్రవక్తకు గల మక్కువ మరియు ధర్మవ్యాప్తి పట్ల పట్టుదలతో ప్రవక్త చేసే కృషి శ్రమ ఎలాంటిదో తెలుస్తుంది.
  3. ప్రతీ విషయం లో అతిశయోక్తి హరాము చేయబడినది.
  4. ముఖ్యమైన విషయాన్ని నిర్ధారిస్తూ తాకీదు చేయడం ముస్తహాబ్బ్ చర్య.
  5. ప్రతీ విషయం లో తటస్తత కలిగి ఉండాలని ప్రోత్సహించబడుతుంది.
  6. ఇస్లాం చూపించే దయ మరియు దాని సౌలభ్యత గురించి తెలుస్తుంది.
ఇంకా