عن عائشة رضي الله عنها ، قالت: لما نُزِلَ برسول الله صلى الله عليه وسلم ، طَفِقَ يَطْرَحُ خَمِيصَةً له على وجهه، فإذا اغْتَمَّ بها كشفها فقال -وهو كذلك-: "لَعْنَةُ الله على اليهود والنصارى، اتخذوا قبور أنبيائهم مساجد -يُحَذِّرُ ما صنعوا".
ولولا ذلك أُبْرِزَ قَبْرُهُ، غير أنه خَشِيَ أن يُتَّخَذَ مسجدا.
[صحيح] - [متفق عليه]
المزيــد ...
ఆయెషా రజియల్లాహు అన్హ ఉల్లేఖిస్తూ తెలియజేశారు;మహనీయ ప్రవక్త(స)మరణ సమయాన దుప్పటిని,(వస్త్రాన్ని)ముఖం పై కప్పుకునేవారు బాధ అధికమవ్వగానే దాన్ని మళ్ళీ తీసేసెవారు అప్పుడు చెప్పారు"యూదుల పై క్రైస్తవులపై అల్లాహ్ యొక్క శాపం కురియుగాక వారు తమ ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు,ఒక వేళ ప్రజలు ప్రవక్త సమాధిని మస్జిద్ గా మార్చుకుంటారన్న భయమే లేకుంటే దానిని బహిరంగంగా ఉంచేవారము.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి
ఆయెషా రజియల్లాహు అన్హా తెలియజేశారు : మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ మరణ సమయంలో ఉన్నప్పుడు భోదించారు:-“అల్లాహ్ యూదులను మరియు నసారాను శపించాడు” –ఎందుకంటే వారు ప్రవక్తల సమాధులపై మస్జిదును నిర్మించారు,ఆయెషా రజియల్లాహు అన్హా దీని నుండి విషయాన్ని గ్రహిస్తూ చెప్పారు:ఇది ఉపదేశించడానికి దైవప్రవక్త యొక్క ఉద్దేశ్యం ‘యూదులు మరియు క్రైస్తవులు చేసినట్లుగా తన ఉమ్మత్ ప్రవక్త సమాధి పై మస్జిద్ నిర్మించకూడదని హెచ్చరించారు,ఆపై ఆమె చెప్తూ : సహాబాలు ప్రవక్తను ఆయన గది నుండి బయట సమాధి చేయడాన్నిఆపుతూ ఆయన సమాధిని మస్జిద్ గా మార్చేస్తారన్నఆ కారణం వల్ల భయం వల్ల నిరోధించారు.