عن أبي هريرة رضي الله عنه قال:
كان رسولُ الله صلى الله عليه وسلم إذا عَطَس وضَعَ يَدَه -أو ثوبَهُ- على فيهِ، وخَفَضَ -أو غضَّ- بها صوتَهُ.
[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 5029]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”
[దృఢమైనది] - - [سنن أبي داود - 5029]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు:
మొదట: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటికి చేతిని లేదా ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకునేవారు – తుమ్ము కారణంగా తన నోటి నుండి లేదా ముక్కు నుండి ఏమైనా బయటకు చింది అక్కడ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా.
రెండు: ఆయన తన గొంతు నుండి ఎక్కువగా శబ్దం బయటకు రాకుండా (సాధ్యమైనంత) తక్కువ చేసేవారు.