عن أبي هريرة رضي الله عنه : أن رسول الله صلى الله عليه وسلم قال:«حقُّ المُسلمِ على المُسلمِ خمسٌّ: ردُّ السلام، وعِيَادَةُ المريض، واتباع الجنائز، وإجابة الدَّعوة، وتَشميتُ العاطِس».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూహురైర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ భోదించారు ‘ఒక ముస్లింపై మరొక ముస్లింకు అయిదు హక్కులు ఉన్నాయి :1-సలాం కు ప్రతి సలాం చేయడం ,2-రోగిని పరామర్శించటం,3-జనాజా తో పాటు నడవడం 4-దావత్ స్వీకరించటం,5-తుమ్మిన వ్యక్తి అల్హందులిల్లాహ్ పలికితే యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పటం.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

ఈ హదీస్ లో ముస్లిములకు ఇతర ముస్లిముల పట్ల గల కొన్నిహక్కుల గురించి భోదించబడినది,ముస్లిం హక్కులు తన సోధరుడికి సంభందించి అనేకం ఉన్నాయి కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కొన్నిసార్లు అందులోని ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా ఆచరించడానికి ప్రస్తావిస్తూ ఉండేవారు,అందులోని కొన్ని అబుహురైర రజియల్లాహు అన్హు మహనీయ దైవప్రవక్త సల్లల్లహు అలైహివ సల్లమ్ ద్వారా ఉల్లేఖిస్తూ తెలియజేశారు;ఆయన భోదించారు – ఒక ముస్లిం పై మరొక ముస్లిము కు ఐదు హక్కులు గలవు,సలాం కు ప్రతిసలామ్ బదులు చేయడం అనగా నీకు సలాం చేసినప్పుడు ఖచ్చితంగా అతనికి జవాబు చెప్పాలి,మరో హదీసులో ఇలా ఉంది - ఒక ముస్లింపై మరొక ముస్లిముకు ఆరు హక్కులు గలవు:అతన్ని కలిసినప్పుడు సలాం చేయాలి,ఎవరైతే ముస్లింపట్ల ఈ హక్కులను పూర్తిచేస్తాడో అతను ఇతర హక్కులను కూడా పూర్తిస్థాయిలో పూరిస్తాడు,ఇలా అతను ఈ హక్కులను విధులను నిర్వహిస్తూ అందులో ఇమిడి ఉన్న గొప్పమేలును,పెద్ద పుణ్యాన్ని అల్లాహ్ నుండి పుణ్యఫలం ఆర్జించి చేసిన యెడల,దాని పుణ్యం అల్లాహ్ వద్ద ప్రతిఫలంగా పొందుతాడు.ఈ హక్కులలో మొదటిది ‘ఒక ముస్లిమును కలిసినప్పుడు సలాం చేయడం లేదా మరో హదీసు ప్రకారం సలాం కు ప్రతి సలాం బదులుచెప్పడం’,రెండవ హక్కు : రోగిని పరామర్శించడం –అనారోగ్యానికి గురై జనులకు దూరంగా ఇంట్లో,ఆసుపత్రిలో లేక మరెక్కడైనా ఇరుక్కుపోయినట్లైతే అతన్ని పరామర్శించడం సొధరులైన ముస్లిముల పై హక్కు అవుతుంది,మూడవ హక్కు : జనాజాను అనుసరించడం,వారితో పాటు కలిసి వెళ్ళడం: ఒక ముస్లిము పట్ల అతని సోధరుణి పై ఉన్న హక్కు అతని ‘ఇంటి నుండి నమాజు చేసే స్థలం వరకు అది మస్జిద్ లేక మరోచోటైన సరే పాటు వెళ్ళి అక్కడి నుండి స్మశానం వరకు అనుసరించాలి,నాలుగవ హక్కు :విందు లేక ఆహ్వానాన్ని స్వీకరించాలి, ఒక ముస్లిము పట్ల అతని సోధరుణి పై గల మరో హక్కు విందుకు ఆహ్వానించినప్పుడు దాన్నిస్వీకరించాలి. ఐదవ హక్కు : తుమ్మిన వ్యక్తి అల్హందులిల్లాహ్ పలికితే యర్హముకల్లాహ్ అని జవాబు చెప్పటం-తుమ్ము అల్లాహ్ నుండి నొసగబడిన ఒక అనుగ్రహం,మనిషి అవయవాల్లో ఉన్న గాలి తుమ్ము ద్వారా తొలగిపోతుంది,అల్లాహ్ ఆ గాలి సులభంగా బయటికి పోవడానికి మార్గాన్ని తెరుస్తాడు,దాని వల్ల తుమ్మిన వాడికి విశ్రాంతి లభిస్తుంది,కాబట్టి ఆ అనుగ్రహం కారణంగా అతనిపై అలహామ్దులిల్లాహ్’ పలకడం తప్పనిసరి చేయబడినది,అలాగే అది విన్న అతని సోదరుని పై కూడా’-యర్హముకల్లాహ్ –అల్లాహ్ నీ పై దయచూపుగాక-పలకడం విధి చేశాడు,మరియు దానికి జవాబుగా –యహ్దీకుముల్లాహు వ యుస్లిహు బాలకుమ్’అని చెప్పాలని ఆదేశించారు,మరెవరైతే తుమ్మిన తరువాత ‘అల్హందులిల్లాహ్’ చదువడో అతను- యర్హముకల్లాహ్-అనే దుఆ కు అనర్హుడు,అతను నిందించుకుంటే తనను తానే నిందించుకోవాలి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్
అనువాదాలను వీక్షించండి

ప్రయోజనాలు

  1. ముస్లిములకు ఇతర ముస్లిములకు గల హక్కుల గురించి ఈ హదీసు లో ప్రస్తావించబడుతుంది,పరస్పర ముస్లిము హక్కుల విషయంలో కొన్ని విధిగా చేయవలసినవైతే,మరి కొన్ని చేయడం సున్నతు,అవి సందర్భాన్ని మరియు మనిషిని బట్టి మారుతూ ఉంటాయి.
  2. సలాం కు ప్రతీసలామ్ చేయడం,{“ఫర్ద్ ఐన్”}ఖచ్చితంగా విధి అవుతుంది ఒకవేళ సలాం చేయబడిన వ్యక్తి ఒక్కరే అయితే,అదే ఒకవేళ సమూహం ఉన్నట్లైతే వారిపై ‘ఫర్ద్ కిఫాయ’అవుతుంది.
  3. రోగిని పరామర్శించడం ఫర్జే కిఫాయ అవుతుంది.
  4. జనాజా వెనుక నడవడం ఫర్జే కిఫాయా,అది ఆ జనాజా యొక్క ఇంటి నుండి లేదా జనాజా నమాజు చదివించిన ప్రదేశం నుండి సమాధి చేసే ప్రదేశం వరకు ఉంటుంది.
  5. నూతన వరుడు ఆహ్వానించిన వలీమా విందులో పాల్గొనడం ఫిఖా పుస్తకాల్లో తెలిపిన కొన్ని షరతుల వెలుగులో విధిగా ఉంది,అలాగే ఇతర విందుల్లో పాల్గొవడం 'సున్నతె ముఅక్ఖదా' గా తెలుపబడింది.
  6. తుమ్మిన వ్యక్తి ‘అల్హమ్దులిల్లాహ్’ పలికిన తరువాత-గురించి కొంత మంది ధార్మిక పండితులు తెలియజేస్తూ ‘ఒకవేళ ఒంటరిగా ఉంటే జవాబు చెప్పడం ‘ఖచ్చితమైన విధిగా పేర్కున్నారు,సముదాయం ఉన్నట్లైతే ‘ఫర్జే కిఫాయా’గా పేర్కొన్నారు,మరి కొంత మంది -దీనిని ‘ఇష్టకరమైన ముస్తహబ్ చర్య గా తెలియజేశారు.
  7. ఇస్లాం గొప్పతనం ముస్లిముల పరస్పరం సోధరభావాన్ని మరియు వారి మధ్య ఫ్రేమానురాగాల దృఢపరచడంలో ఉంది.
  8. జుమా సందర్భం లో ఇమామ్ ఖుత్బా ఇస్తున్నప్పుడు తుమ్మిన వ్యక్తికి మరియు సలాం చేసినవాడికి ప్రతి జవాబు చెప్పడానికి అనుమతి లేదు,ఎందుకంటే ఇవి రెండు కూడా సంభాషణ కోవలోకి వస్తాయి,ఖుత్బా జరుగుతున్నప్పుడు సంభాషించడం హరాముగా పేర్కొనడం జరిగింది.
ఇంకా