عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«خَيْرُ يَوْمٍ طَلَعَتْ عَلَيْهِ الشَّمْسُ يَوْمُ الْجُمُعَةِ، فِيهِ خُلِقَ آدَمُ، وَفِيهِ أُدْخِلَ الْجَنَّةَ، وَفِيهِ أُخْرِجَ مِنْهَا، وَلَا تَقُومُ السَّاعَةُ إِلَّا فِي يَوْمِ الْجُمُعَةِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 854]
المزيــد ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“సూర్యుడు ఉదయించే దినములలో ఉత్తమమైన దినము ‘శుక్రవారము’. శుక్రవారమునాడే ఆదం అలైహిస్సలాం సృష్టించబడినారు; శుక్రవారమునాడే ఆయన స్వర్గములో ప్రవేశింపజేయబడినారు, శుక్రవారమునాడే ఆయన దాని నుండి బయటకు తీయబడినారు; మరియు శుక్రవారమునాడు తప్ప ప్రళయ ఘడియ స్థాపించబడదు.”
[దృఢమైనది] - [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు] - [صحيح مسلم - 854]
సూర్యుడు ఉదయించే దినములలో అత్యంత ఉత్తమమైన దినము శుక్రవారము అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. శుక్రవారము యొక్క ప్రత్యేకతలలో ఇవి కొన్ని: శుక్రవారము నాడు అల్లాహ్ ఆదం అలైహిస్సలాం ను సృష్ఠించినాడు; శుక్రవారం నాడే ఆయనను స్వర్గములో ప్రవేశింపజేసి నాడు; శుక్రవారము నాడే ఆయనను స్వర్గము నుండి బయటకు తీసి భూమి పైకి పంపినాడు; మరియు శుక్రవారమునాడు తప్ప ప్రళయ ఘడియ స్థాపించబడదు.