+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمنينَ رَضيَ اللهُ عنها قَالَت:
قُلْتُ لِلنَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: حَسْبُكَ مِنْ صَفِيَّةَ كَذَا وَكَذَا، -قَالَ أَحدُ الرُّوَاةِ: تَعْنِي قَصِيرَةً- فَقَالَ: «لَقَدْ قُلْتِ كَلِمَةً لَوْ مُزِجَتْ بِمَاءِ الْبَحْرِ لَمَزَجَتْهُ» قَالَتْ: وَحَكَيْتُ لَهُ إِنْسَانًا، فَقَالَ: «مَا أُحِبُّ أَنِّي حَكَيْتُ إِنْسَانًا وَأَنَّ لِي كَذَا وَكَذَا».

[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 4875]
المزيــد ...

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన:
నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: "సఫీయ్యా గురించి మీకు తెలుసు కదా, ఆమె ఇలా-ఇలా ఉంది..." (ఉల్లేఖకులలో ఒకరు ఇలా పలికినారు: ఆమె 'పొట్టిగా ఉంది’ అని). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నీవు చెప్పిన ఆ మాట, ఒకవేళ సముద్రపు నీటిలో కలిపితే, అది నీటినంతా కలుషితం చేసి వేసేది." అది విని ఆమె ఇలా అన్నది: "నేను మీ వద్ద ఒకరిని వెక్కిరించాను, అనుకరించాను (అంటే, ఎవరో ఒకరి నకిలీగా నటించాను) అని అనగా, దానికి ఆయన 'నాకు ఎంతటి గొప్ప బహుమతి ఇచ్చినా కూడా, నేను ఎవరినైనా వెక్కిరించాలని, అనుకరించాలని అనుకోను.'" అని పలికినారు.

[దృఢమైనది] - - [سنن أبي داود - 4875]

వివరణ

విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా (రదియల్లాహు అన్హా), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: "సఫీయ్యా గురించి మీకు తెలుసు కదా..." (అంటే, ఆమె శరీరంలో ఒక లోపం గురించి అంటే ఆమె పొట్టిగా ఉండడం గురించి ప్రస్తావించారు). దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానము ఇచ్చినారు: "నీవు చెప్పిన ఆ మాట, ఒకవేళ సముద్రపు నీటిలో కలిపితే, అది ఆ నీటిని పూర్తిగా కలుషితం చేసి, దాని స్వభావాన్ని మార్చి, చెడిపోయేలా చేస్తుంది." అపుడు ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా అన్నారు: "నేను ఒకరిని వెక్కిరిస్తూ అనుకరించాను." దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎంతటి గొప్ప సంపద ఇచ్చినా కూడా, నేను ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడడాన్ని, లేదా అతడి చర్యలను / మాటలను వెక్కిరిస్తూ, ఆటపట్టిస్తూ అనుకరించడాన్ని నేను ఇష్టపడను."

من فوائد الحديث

  1. గీబతు (చాడీల) గురించి తీవ్రంగా హెచ్చరించవలసిన మరియు దానిని సమూలంగా నివారించ వలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది.
  2. ఇతరులను తక్కువ చేసే లేదా కించపరిచే విధంగా వారి రూపాన్ని లేదా చర్యలను అనుకరించడం నిషిద్ధమైన చాడీల మాటగా పరిగణించబడుతుంది.
  3. ఇతరుల శారీరక లోపాలను కించపరుస్తూ వర్ణించడం కూడా ఒక రకమైన చాడీ మాటే.
  4. అల్-ఖాది (రహిమహుల్లాహ్) ఇలా చెప్పినారు: "కలిపివేయడం" అంటే, వేరే దానిని జోడించడం ద్వారా మిశ్రమం చేయడం, దాని స్వభావాన్ని మార్చడం. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే — గీబతు (చాడీలు) సముద్రంలో కలిపితే, సముద్రం ఎంత విస్తారంగా, బ్రహ్మాండంగా ఉన్నా, దాని స్వభావాన్నే మార్చేస్తుంది. అయితే, ఆ గీబతు మన మంచి పనుల్లో కలిస్తే, అవి పరిమితమైనవిగా ఉన్నా సరే, వాటిపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో ఒకసారి ఊహించండి!
  5. భార్యల మధ్యలో కలిగే అసూయ గురించి కొన్ని విషయాల వివరణ.
  6. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెడు పనులను ఎప్పుడూ ఆమోదించలేదు.
  7. ప్రాపంచిక విషయాల తక్కువతనాన్ని, అల్లాహ్ సంతృప్తి ముందు చూపించడం అంటే ప్రాపంచిక విషయాలు ఎంత గొప్పగా కనిపించినా, అవి అల్లాహ్ సంతృప్తి ముందు చాలా చిన్నవిగా, తక్కువగా ఉంటాయి.
  8. ఇస్లాం ధర్మం మంచి నైతిక విలువల (సద్గుణాల) ధర్మం. ఇది మనుషుల గౌరవాన్ని, పరువు ప్రతిష్ఠను మాటల ద్వారా అయినా, చర్యల ద్వారా అయినా దెబ్బతీయకుండా రక్షించమని ఆదేశిస్తుంది. ఎందుకంటే, ఇలాంటి చెడు ప్రవర్తన ముస్లింల మధ్య ద్వేషం, శత్రుత్వాన్ని పెంచుతుంది.
అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు స్వాహిలీ థాయ్ అస్సామీ الهولندية الغوجاراتية الرومانية المجرية الجورجية
అనువాదాలను వీక్షించండి
ఇంకా