عَنْ حَكِيمِ بْنِ حِزَامٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
سَأَلْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَأَعْطَانِي، ثُمَّ سَأَلْتُهُ فَأَعْطَانِي، ثُمَّ قَالَ لِي: «يَا حَكِيمُ، إِنَّ هَذَا المَالَ خَضِرٌ حُلْوٌ، فَمَنْ أَخَذَهُ بِسَخَاوَةِ نَفْسٍ، بُورِكَ لَهُ فِيهِ، وَمَنْ أَخَذَهُ بِإِشْرَافِ نَفْسٍ لَمْ يُبَارَكْ لَهُ فِيهِ، وَكَانَ كَالَّذِي يَأْكُلُ وَلاَ يَشْبَعُ، وَاليَدُ العُلْيَا خَيْرٌ مِنَ اليَدِ السُّفْلَى»، قَالَ حَكِيمٌ: فَقُلْتُ: يَا رَسُولَ اللَّهِ، وَالَّذِي بَعَثَكَ بِالحَقِّ لاَ أَرْزَأُ أَحَدًا بَعْدَكَ شَيْئًا حَتَّى أُفَارِقَ الدُّنْيَا، فَكَانَ أَبُو بَكْرٍ يَدْعُو حَكِيمًا لِيُعْطِيَهُ العَطَاءَ، فَيَأْبَى أَنْ يَقْبَلَ مِنْهُ شَيْئًا، ثُمَّ إِنَّ عُمَرَ دَعَاهُ لِيُعْطِيَهُ، فَيَأْبَى أَنْ يَقْبَلَهُ، فَقَالَ: يَا مَعْشَرَ المُسْلِمِينَ، إِنِّي أَعْرِضُ عَلَيْهِ حَقَّهُ الَّذِي قَسَمَ اللَّهُ لَهُ مِنْ هَذَا الفَيْءِ، فَيَأْبَى أَنْ يَأْخُذَهُ. فَلَمْ يَرْزَأْ حَكِيمٌ أَحَدًا مِنَ النَّاسِ بَعْدَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَتَّى تُوُفِّيَ رَحِمَهُ اللَّهُ.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2750]
المزيــد ...

హకీం ఇబ్న్ హిజామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:
“నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లంను కొంత డబ్బు అడిగాను, ఆయన దానిని నాకు ఇచ్చారు. తరువాత నేను ఆయనను మళ్ళీ అడిగాను, ఆయన దానిని నాకు ఇచ్చారు. తరువాత నేను ఆయనను మళ్ళీ అడిగాను, ఆయన మళ్ళీ నాకు ఇచ్చారు, మరియు ఆయన ఇలా అన్నారు: “ఓ హకీం! నిశ్చయంగా ఈ డబ్బు మధురమైన తాజా ఫలం వంటిది. ఎవరైతే అత్యాశలేని అంతరాత్మతో దానిని తీసుకుంటారో (సంపాదిస్తారో), అతని కొరకు అందులో ఆశీర్వాదము, శుభము ఉంటుంది. మరియు ఎవరైతే అత్యాశతో దానిని తీసుకుంటారో (సంపాదిస్తారో) అతనికి అందులో శుభము, ఆశీర్వాదము ఉండవు. అతడు ఎంత తిన్నా సంతృప్తి చెందని వంటి వాడు. పైన ఉండే చేయి, క్రింద ఉండే చేయి కంటే గొప్పది.” హాకిం రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! ఎవరైతే మిమ్ములను సత్యముతో పంపినాడో ఆ అల్లాహ్ సాక్షిగా, (మీనుండి తీసుకున్నాను) ఇక మీ తరువాత, నేను ఈ ప్రపంచము నుండి వెళ్ళిపోయే వరకూ ఇంకెవరి నుండీ ఏమీ తీసుకోను.” తరువాత అమీరుల్ ము’మినీన్ అబూ బక్ర్ రదియల్లాహు అన్హు, హకీమ్ రదియల్లాహు అన్హుకు ఏమైనా ఇవ్వడానికి పిలిచే వారు, కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవాడు. తరువాత ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు అయనకు ఏమైనా ఇవ్వడానికి పిలిచే వారు. కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవాడు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ ముస్లిములారా! ఈ యుద్ధ సంపదలో అల్లాహ్ తనకు హక్కుగా ఇచ్చిన వాటాను నేను అతనికి అందించడానికి పిలిచాను. కానీ దానిని తీసుకోవడానికి అతడు నిరాకరించినాడు.” అలా హాకిం రదియల్లాహు అన్హు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత తాను మరణించేవరకు ఎవరి నుండి ఏమీ తీసుకోలేదు. అల్లాహ్ ఆయనపై కరుణ చూపుగాక.

[ప్రామాణికమైన హదీథు] - [అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు] - [సహీహ్ అల్ బుఖారీ - 2750]

వ్యాఖ్యానము

హకీం ఇబ్న్ హిజాం రదియల్లాహు అన్హు ప్రాపంచిక జీవితావసరాలకు సంబంధించి కొన్ని సరుకుల కొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అర్ధించినారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి వాటిని ఇచ్చినారు. హాకిం (ర) మళ్ళీ అడిగినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ వాటిని ఇచ్చినారు. తరువాత హాకిం (ర) మళ్ళీ అడిగినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మళ్ళీ ఆయనకు ఇచ్చినారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఓ హకీమ్! ఈ సంపద మధురమైనది మరియు ఆకర్షణీయమైనది. ఎవరైతే అత్యాశకు పోకుండా, వెంటపడి ఎవరినీ యాచించకుండా దానిని తీసుకుంటాడో (సంపాదిస్తాడో) అది అతనికి ఆశీర్వాదము అవుతుంది. కానీ ఎవరైతే దాని పట్ల లాలస మరియు కోరికతో దానిని తీసుకుంటాడో (సంపాదిస్తాడో) అది అతనికి ఆశీర్వాదము అవదు. అటువంటి వాడు ఎంత తిన్నా ఎన్నటికీ తృప్తి చెందనివాని వంటి వాడు. అల్లాహ్ దృష్టిలో పైన ఉండే దానం చేసే చేయి, క్రింద ఉండే యాచించే చేయి కంటే గొప్పది.” హాకిం రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “అపుడు నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మీ తరువాత నేను ఇంకెవరినీ, నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయే వరకూ, దేని కొరకూ అడగను.” రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఖలీఫా అబూబక్ర్ రదియల్లాహు అన్హు ఖజానా నుండి అతనికి బహుమతిగా రావలిసిన వాటాను ఇవ్వడానికి హాకిం రదియల్లాహు అన్హుని పిలిచేవారు. కానీ ఆయన ఏమీ తీసుకోకుండా నిరాకరించేవారు. అబూబక్ర్ రదియల్లాహు అన్హు తరువాత ఉమర్ రదియల్లాహు అన్హు కూడా ఆయనను పిలిచినారు, కానీ హాకిం రదియల్లాహు అన్హు ఆయన నుండి కూడా ఏమీ తీసుకోకుండా నిరాకరించినారు. అపుడు ఉమర్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ ముస్లిములారా! అవిశ్వాసులతో యుద్ధం గానీ జిహాద్ గానీ చేయకుండానే సంపాదించిన యుద్ధసంపద నుండి అల్లాహ్ అతనికి కేటాయించిన అతని హక్కు వాటాను నేను అతనికి అందజేస్తున్నాను. అయినప్పటికీ అతడు దానిని తీసుకోకుండా నిరాకరిస్తున్నాడు.” ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత హకీం రదియల్లాహు అన్హు తాను చనిపోయేవరకూ ఎవరినీ ఏమీ అడుగలేదు, ఎవరి నుండీ ఏమీ తీసుకోలేదు. అల్లాహ్ ఆయన పట్ల ప్రసన్నుడవు గాక.

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

  1. చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపదను సంపాదించడం మరియు కూడబెట్టుకోవడం ఈ ప్రపంచం పట్ల వైరాగ్యానికి విరుద్ధమేమీ కాదు, ఎందుకంటే వైరాగ్యమనేది ఆత్మ యొక్క ఔదార్యం మరియు హృదయానికి సంపద పట్ల మమకారం లేకపోవడం.
  2. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప దాతృత్వాన్ని మరియు ఆయన గొప్ప ఔదార్యాన్ని వివరిస్తున్నది. ఇందులో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పేదరికానికి ఎప్పుడూ భయపడని వ్యక్తిలా దానం చేయడాన్ని చూస్తాము.
  3. సహాయం అందించేటప్పుడు నిజాయితీగల సలహా ఇవ్వడం మరియు మీ సోదరులకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రయత్నించడం చేయాలి; ఎందుకంటే ఆ స్థితిలో ఆత్మ కరుణాపూరితమైన మరియు ప్రయోజనకరమైన మాటలను ఎక్కువగా గ్రహిస్తుంది.
  4. ప్రజలను సహాయం అడగడం నుండి దూరంగా ఉండాలి, మరియు సహాయం అడగడం మానుకోవాలి; ముఖ్యంగా దాని అవసరం లేనప్పుడు.
  5. ఇందులో సంపదపై దురాశ యొక్క ఖండన మరియు ఎక్కువ ప్రశ్నలు అడగడం కూడా ఉన్నాయి.
  6. ఒక బిచ్చగాడు పట్టుబట్టి, వెంటపడి అడుగుతుంటే, అతన్ని తిరస్కరించడంలో, నిరాశపరచడంలో, అతనికి బుద్ధి చెప్పడంలో, మంచిగా ఉండమని, ఏదైనా తీసుకోవడంలో దురాశ పడకూడదని ఆజ్ఞాపించడంలో తప్పు లేదు.
  7. పాలకుడు మంజూరు చేసిన తర్వాత తప్ప, బైతుల్-మాల్ (ప్రజా ఖజానా, ప్రభుత్వ ఖజానా) నుండి ఎవరికీ ఏమీ తీసుకునే హక్కు లేదు; అయితే, యుద్ధ సంపదగా సమీకరించిన వస్తువులను పంపిణీ చేయడానికి ముందు, దానిపై ఎవరికీ ఎటువంటి హక్కు లేదు.
  8. అత్యవసర పరిస్థితులలో ఇతరులను అడగడం అనుమతించబడినదే.
  9. ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఇమామ్ (నాయకుడు) అర్థించే వ్యక్తికి, యాచించడం వల్ల కలిగే హానిని, అతని అవసరం తీరే వరకు అతనికి వివరించకూడదని దీని అర్థం, తద్వారా అతని ఉపదేశం ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే అతను తన అవసరాన్ని తీర్చకుండా నిరోధించడానికి ఇది ఒక కారణమని అతను అనుకోవచ్చు.
  10. అలాగే ఇందులో హాకిం (రదియల్లాహు అన్హు) యొక్క ఘనతను చూడవచ్చు. అయన అల్లాహ్ మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చేసిన వాగ్దానంపై తాను చనిపోయే వరకు స్థిరంగా నిలబడి ఉన్నారు.
  11. ఇస్’హాఖ్ ఇబ్న్ రాహవైహ్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “హాకిం (రదియల్లాహు అన్హు) చనిపోయినప్పుడు, సంపన్నులైన ఖురైషీయులలో ఆయన కూడా ఒకరిగా ఉన్నారు.
అనువాదాలను చూపించండి
ఇంకా