عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«حُجِبَتِ النَّارُ بِالشَّهَوَاتِ، وَحُجِبَتِ الْجَنَّةُ بِالْمَكَارِهِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6487]
المزيــد ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
“నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”.
[దృఢమైనది] - [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు] - [صحيح البخاري - 6487]
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నరకాన్ని చుట్టి ఉన్న విషయాల గురించి వివరిస్తున్నారు. అవి, మనసు వాంఛించే మరియు కావాలని కోరుకునే, నిషేధించబడిన విషయాలు మరియు తాను విధిగా ఆచరించ వలసిన విషయాలను నిర్లక్ష్యం చేసి, వాటిని వదిలివేయడం వంటివి అని వివరిస్తున్నారు. ఎవరైతే తన చపల చిత్తాన్ని మరియు దాని వాంఛలను అనుసరిస్తాడో, అతడు నరకానికి పాతృడు అవుతాడు. మరియు స్వర్గము, మనసు (సాధారణంగా) ఇష్టపడని విషయాలతో – అంటే, ఉదాహరణకు, (షరియత్’లో) ఆదేశించబడిన విషయాల పట్ల సహనం కలిగి ఉండి, వాటిని నిరంతరం పట్టుదలతో ఆచరించుట, (షరియత్) నిషేధించిన విషయాలను త్యజించుట మరియు అలా త్యజించడం పట్ల సహనం వహించుట మొదలైన విషయాలతో ఆవరించబడి ఉన్నది. ఒకవేళ ఎవరైతే వీటిని ఎదుర్కోవడానికి మరియు వీటి పట్ల నిరంతరం కృషి చేయడానికి సిధ్ధపడతాడో, అతడు స్వర్గములో ప్రవేశించడానికి పాత్రుడు అవుతాడు.