عن أبي سعيد وأبي هريرة رضي الله عنهما مرفوعاً: «ما يُصيب المسلم من نَصب، ولا وصَب، ولا هَمِّ، ولا حَزن، ولا أَذى، ولا غَمِّ، حتى الشوكة يُشاكها إلا كفر الله بها من خطاياه».
[صحيح] - [متفق عليه]
المزيــد ...

అబూ సయీద్ మరియు అబూహురైర రజియల్లాహు అన్హుమ మర్ఫూ ఉల్లేఖనం: ముస్లిం కు కలిగే ఎటువంటి కష్టనష్టాలైన వ్యాధి,భాధ,వ్యధ,ఆందోళన చివరికి ఒక ముల్లుకుచ్చిన దాని వలన కూడా అల్లాహ్ అతని తప్పిదాలను ప్రక్షాళిస్తాడు.
దృఢమైనది - ముత్తఫిఖ్ అలైహి

వివరణ

హదీసు అర్ధం :ఒక ముస్లిముకు కలిగే వ్యాధులు,చింతలు,ఆందోళనలు,కష్టాలు,ఆపదలు,తీవ్రతలు,భయాలు మరియు భాధలు ఇవన్నీకూడా అతని పాపాలను ప్రక్షాళన పరుస్తాయి,తప్పులను తుడిచివేస్తాయి,ఇవి కలిగినప్పుడు వ్యక్తి వాటిపై సహనం పాటిస్తూ పుణ్యఫలాపేక్షతను కోరితే అతనికి పాపప్రక్షాళనతో పాటు పుణ్యం కూడా దక్కుతుంది,ఆపదలు రెండు రకాలుగా ఉంటాయి :కొన్ని సార్లు ఆపదలు కలిగినప్పుడు మనిషి వాటి పై ఓర్పు వహిస్తూ దానికి బదులుగా నొసగబడే పుణ్యాన్ని అల్లాహ్ నుండి ఆశిస్తూ ఉంటాడు,అప్పుడు అతనికి రెండు ప్రయోజనాలు చేకూరుతాయి:పాపాలు ప్రక్షాళించబడతాయి,పుణ్యాలు వృద్ది చెందుతాయి,కొన్ని సార్లు మనిషి మదిలో ఈ విషయం లేకపోవడం వల్ల ఆందోళన వ్యాఖులతకు గురై చింతిస్తూ బాధకు గురవుతాడు,అల్లాహ్ పుణ్యం ప్రసాదిస్తాడు అనే విషయం అతని మదిలో లేకపోయినప్పటికి కూడా అతని పాపాలు మన్నించ బడతాయి,అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి ప్రయోజనం చేకూరుతుంది,ఎటువంటి పుణ్యాలు లేకుండా కేవలం అతని పాపాలు మన్నించబడతాయి,తప్పులు సమసిపోతాయి,ఎందుకంటే అతను ఎలాంటి సత్సంకల్పాన్ని కలిగిలేడు మరియు పుణ్యఫలాపేక్షతో ఓర్పు వహించలేదు,లేదా మొదట చెప్పినట్లు అతనికి రెండు ప్రయోజనాలు చేకూరుతాయి అనగా అతని పాపాలు క్షమించబడతాయి మరియు అల్లాహ్ తరుపు నుండి పుణ్యం కూడా ప్రసాదించబడుతుంది,కాబట్టి మనిషికి ఏ ఆపద కలిగిన చివరికి ఒక ముల్లు గుచ్చిన ఆ ఆపదలో ఓర్పువహిస్తూ అల్లాహ్ నుండి పుణ్యఫలపేక్షను కూడా కలిగి ఉండాలి దాని వలన అతని పాపాల ప్రక్షాళనతో పాటు,పుణ్యం కూడా సిద్దిస్తుంది,ఇది అల్లాహ్ వైపు నుండి ఒక గొప్ప అనుగ్రహం తో పాటు దయాదాక్షిన్యాల ప్రజ్వరిల్లే విషయం కూడా,అల్లాహ్ ఒక ముస్లిమును ఆపదకు గురి చేసి పరీక్షించినట్లైతే దాని పై అతని పాపాలను మన్నిస్తాడు లేదా పుణ్యం ప్రసాదిస్తాడు,గమనిక : చిన్న పాపాలు మాత్రమే ప్రక్షాళించబడతాయి,పెద్దపాపాలు క్షమించబడవు అవి కేవలం నిజమైన తౌబా వల్ల మాత్రమే ప్రక్షాళించబడతాయి.

అనువాదము: ఇంగ్లీషు ఫ్రెంచ్ స్పానిష్ టర్కిష్ ఉర్దూ ఇండోనేషియన్ బోస్నియన్ రష్యన్ బెంగాలీ చైనీస్ పర్షియన్ టాగలాగ్ హిందీ వియత్నమీస్ సింహళ ఉయ్ఘర్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ థాయ్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్ السويدية الأمهرية الهولندية الغوجاراتية الدرية
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఈ హదీస్ లో చెప్పిన విధంగా –ఒక ముస్లిం వివిధ రకాలైన రోగాలకు మరియు పరీక్షలకు గురైనప్పుడు అవి అతన్నితప్పిదాల నుండి మరియు పాపాల నుండి పరిశుద్దపరుస్తాయి ఒకవేళ అవి తక్కువగా ఉన్నా సరే!
  2. ఈ హదీస్ లో ముస్లిముల కొరకు ఒక గొప్ప శుభవార్త ఉంది ఎందుకంటే ‘ఈ రకమైన కష్టాల ద్వారా ముస్లిము గురవుతాడు.
  3. ఈ రకమైన పరీక్షల వల్ల వ్యక్తి యొక్క అంతస్తులు పెరుగుతాయి మరియు అతని పుణ్యాల్లో పెరుగుదల ప్రాప్తిస్తుంది.
  4. హదీసులో తెలిపిన ప్రకారం పాప ప్రక్షాలను పరిచే ఈ విషయం కేవలం చిన్న పాపాల కు మాత్రమే వర్తిస్తుంది,మహాపరాధలను మాత్రం తౌబా చేసుకోవడం వల్ల మాత్రమే సమసిపోతాయి.
ఇంకా