عَنْ طَلْحَةَ بْنِ عُبَيْدِ اللهِ رضي الله عنه قَالَ:
جَاءَ رَجُلٌ إِلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ أَهْلِ نَجْدٍ ثَائِرُ الرَّأْسِ، نَسْمَعُ دَوِيَّ صَوْتِهِ، وَلَا نَفْقَهُ مَا يَقُولُ حَتَّى دَنَا مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَإِذَا هُوَ يَسْأَلُ عَنِ الْإِسْلَامِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «خَمْسُ صَلَوَاتٍ فِي الْيَوْمِ وَاللَّيْلَةِ» فَقَالَ: هَلْ عَلَيَّ غَيْرُهُنَّ؟ قَالَ: «لَا، إِلَّا أَنْ تَطَّوَّعَ، وَصِيَامُ شَهْرِ رَمَضَانَ»، فَقَالَ: هَلْ عَلَيَّ غَيْرُهُ؟ فَقَالَ: «لَا، إِلَّا أَنْ تَطَّوَّعَ»، وَذَكَرَ لَهُ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ الزَّكَاةَ، فَقَالَ: هَلْ عَلَيَّ غَيْرُهَا؟ قَالَ: «لَا، إِلَّا أَنْ تَطَّوَّعَ»، قَالَ: فَأَدْبَرَ الرَّجُلُ، وَهُوَ يَقُولُ: وَاللهِ، لَا أَزِيدُ عَلَى هَذَا، وَلَا أَنْقُصُ مِنْهُ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَفْلَحَ إِنْ صَدَقَ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 11]
المزيــد ...
తల్హా ఇబ్నె ఉబైదుల్లాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నజ్ద్ ప్రాంతపు ప్రజల నుండి చెదిరిన జుట్టుతో ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చాడు. అతను ఉచ్ఛ స్వరంతో మాట్లాడడం మేము వినగలుగుతున్నాము, కాని అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చే సరికి, అతను ఇస్లాం గురించి అడుగుతున్నాడని స్పష్టమైంది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా చెప్పారు: “దినము మరియు రాత్రిలో (విధిగా ఆచరించవలసిన) ఐదు సలాహ్’లు (నమాజులు) ఉన్నాయి”; దానికి అతడు “ఇవి గాక ఇంకేమైనా (నమాజులు) నాపై ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప. అలాగే (విధిగా ఆచరించవలసిన) రమదాన్ మాసపు ఉపవాసాలున్నాయి” అన్నారు. అతడు “ఇవిగాక నాపై ఇంకేమైనా (ఉపవాసాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలకునుంటే తప్ప” అన్నారు. తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి జకాత్ గురించి తెలిపినారు. దానికి అతడు “ఇది గాక నాపై ఇంకేమైనా (దానాలు) ఉన్నాయా?” అని ప్రశ్నించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛందంగా ఆచరించాలనుకుంటే తప్ప” అన్నారు. దానితో అతడు ఇలా అంటూ వెనుదిరిగినాడు “అల్లాహ్ సాక్షిగా, దీనిపై ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, దీని నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను”. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతను సత్యవంతుడైతే అతను విజయం సాధిస్తాడు.”
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح مسلم - 11]
నజ్ద్ నుండి ఒక వ్యక్తి ప్రవక్త వద్దకు వచ్చాడు, అతని జుట్టు అస్తవ్యస్తంగా ఉంది, అతని గొంతు బిగ్గరగా ఉంది, కానీ అతను ఏమి చెబుతున్నాడో అర్థం కాలేదు. అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం ధర్మం యొక్క తప్పనిసరి విధుల గురించి (ఫరాయిద్ గురించి) అడిగాడు.
ప్రవక్త అతనికి సలాహ్ గురించి చెప్పడంతో ప్రారంభించారు, మరియు అల్లాహ్ ప్రతి దినము మరియు రాత్రిలో అతని కొరకు ఐదు సలాహ్’లను తప్పనిసరి చేశాడని తెలియజేసారు.
అతను ఇలా అడిగినాడు: నేను ఈ ఐదు సలాహ్’లు తప్ప మరేదైనా (సలాహ్) చేయాలా?
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, నీవు స్వచ్ఛందంగా ఆచరిస్తే తప్ప” అన్నారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అల్లాహ్ నీపై విధి గావించిన వాటిలో రమజాన్ మాసం ఉపవాసాలు కూడా ఉన్నాయి”.
దానికి అతడు “రమజాన్ మాసపు ఉపవాసాలు గాక నేను ఇంకేమైనా ఉపవాసాలు పాటించవలసి ఉంటుందా?” అని ప్రశ్నించాడు.
దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేవు, నీవు స్వచ్ఛంద ఉపవాసాలు ఆచరిస్తే తప్ప” అన్నారు.
తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ‘జకాత్’ గురించి ప్రస్తావించారు.
ఆ వ్యక్తి “విధిగా చెల్లించవలసిన ఈ జకాతు గాక నేను ఇంకేమైనా దానములు చేయవలసి ఉంటుందా?” అని ప్రశ్నించాడు.
ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “లేదు, నీవు స్వచ్ఛందంగా ఆచరిస్తే తప్ప” అన్నారు.
ఆ వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఈ విధి ఆచరణలను గురించి విన్న తర్వాత అతను వెనక్కి తిరిగి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై ప్రమాణం చేసాడు, అతను వాటికి దేనినీ జోడించకుండా లేదా వాటి నుండి ఏమీ తీసి వేయకుండా వాటికి కట్టుబడి ఉంటాడని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ వ్యక్తి తాను చేసిన ప్రమాణం గురించి నిజాయితీగా, సత్యవంతుడై ఉంటే, అతను విజయవంతమైన వారిలో ఉంటాడు.