عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا قَالَ:
قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِمُعَاذِ بْنِ جَبَلٍ، حِينَ بَعَثَهُ إِلَى الْيَمَنِ: «إِنَّكَ سَتَأْتِي قَوْمًا أَهْلَ كِتَابٍ، فَإِذَا جِئْتَهُمْ فَادْعُهُمْ إِلَى أَنْ يَشْهَدُوا أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، فَإِنْ هُمْ أَطَاعُوا لَكَ بِذَلِكَ، فَأَخْبِرْهُمْ أَنَّ اللهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ خَمْسَ صَلَوَاتٍ فِي كُلِّ يَوْمٍ وَلَيْلَةٍ، فَإِنْ هُمْ أَطَاعُوا لَكَ بِذَلِكَ، فَأَخْبِرْهُمْ أَنَّ اللهَ قَدْ فَرَضَ عَلَيْهِمْ صَدَقَةً تُؤْخَذُ مِنْ أَغْنِيَائِهِمْ فَتُرَدُّ عَلَى فُقَرَائِهِمْ، فَإِنْ هُمْ أَطَاعُوا لَكَ بِذَلِكَ، فَإِيَّاكَ وَكَرَائِمَ أَمْوَالِهِمْ، وَاتَّقِ دَعْوَةَ الْمَظْلُومِ، فَإِنَّهُ لَيْسَ بَيْنَهُ وَبَيْنَ اللهِ حِجَابٌ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1496]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :
ముఆద్ ఇబ్నె జబల్ రజియల్లాహు అన్హు ను యమన్ కు పంపునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు: “నిశ్చయంగా నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు. వారి వద్దకు చేరినపుడు “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని సాక్ష్యం పలుకమని వారిని ఆహ్వానించు. మరి వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా వారిపై ప్రతి రోజూ ఐదు పూటల నమాజు ఆచరించుటను అల్లాహ్ విధిగా చేసినాడు’ అని. వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా అల్లాహ్ వారిపై ‘సదాఖా చెల్లించుటను (జకాత్ చెల్లించుటను) విధిగా చేసినాడు’ అని, ‘అది వారిలోని ధనవంతుల నుండి తీసుకోబడుతుంది మరియు వారిలోని పేదవారికి ఇవ్వబడుతుంది’ అని. వారు అందులో కూడా నిన్ను అనుసరించినట్లయితే (ఓ ముఆద్!) వారి సంపదలలోని విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త (జకాతులో భాగంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయకు). అన్యాయానికి, దౌర్జన్యానికి గురైన వాని దువా పట్ల భయపడు. ఎందుకంటే, నిశ్చయంగా వాని ఆక్రందనకూ, అల్లాహ్ కు మధ్య ఎటువంటి అడ్డూ ఉండదు”.
[దృఢమైనది] - [ముత్తఫిఖ్ అలైహి] - [صحيح البخاري - 1496]
ముఆద్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ను, ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించే ఒక దాయీగా, మరియు అక్కడి ప్రజలకు ఇస్లాం విధి విధానాలను నేర్పించే ఒక గురువుగా, యమన్ దేశానికి పంపునపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు వివరించినారు – నీవు క్రైస్తవులతో ముఖాముఖీ కాబోతున్నావని, వారి కొరకు (అన్ని విధాలా) తయారుగా ఉండాలని, ఇంకా వారికి ధర్మబోధలో భాగంగా అతిముఖ్య విషయాలు బోధించి ఆ తరువాత ముఖ్య విషయాలను బోధించమని వివరించినారు. ధర్మం పరంగా, వారి విశ్వాసాన్ని తీర్చి దిద్దాడానికి, సంస్కరించడానికి అతడు ముందుగా వారిని “అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యం పలుకుట వైపునకు ఆహ్వానిస్తాడు. ఎందుకంటే అలా సాక్ష్యం పలుకుట ద్వారానే వారు ఇస్లాం లోనికి ప్రవేశిస్తారు. ఒకవేళ వారు దానికి సమ్మతించి అనుసరించినట్లయితే, అపుడు వారిని సలాహ్ (నమాజు) స్థాపించమని ఆదేశిస్తాడు. ఎందుకంటే ఒక ముస్లిం కొరకు తౌహీద్ (నిజ ఆరాధ్యుడు కేవలం ఏకైకుడైన అల్లాహ్ మాత్రమే అని విశ్వసించుట) తరువాత అతి ముఖ్యమైనది సలాహ్ యే. ఒకవేళ వారు దానిని స్థాపించినట్లయితే, వారిలోని ధనవంతులను, తమ సంపదలలో నుంచి పేదవారికి జకాత్ చెల్లించమని ఆదేశిస్తాడు. అలాగే జకాతు పేరున సంపదలలో నుండి ఉత్తమమైన వాటిని ఏరి తీసుకో రాదనే హెచ్చరిక కూడా ఉంది. ఎందుకంటే, విధి నిర్వహణ సమతుల్యతతో కూడి ఉంటుంది. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్యాయానికి పాల్బడ వద్దని హితబోధ చేసినారు. అన్యాయానికి పాల్బడినట్లయితే, అలా అన్యాయానికి గురైన వాడు అల్లాహ్ వద్ద మొరపెట్టుకుంటాడు మరియు అతడి మొర స్వీకరించబడుతుంది.