عَن عَبدِ الله بنِ الشِّخِّير رضي الله عنه قَالَ:
انْطَلَقْتُ في وَفدِ بَنِي عَامِرٍ إِلى رَسُولِ الله صلى الله عليه وسلم، فَقُلنا: أَنتَ سيّدُنَا، فقال: «السَّيدُ اللهُ»، قُلنا: وَأَفْضَلُنا فَضْلاً، وأعظَمُنا طَوْلاً، فقال: «قُولُوا بِقَولِكُم، أَو بَعضِ قولِكُم، وَلَا يَسْتَجْرِيَنَّكُم الشَّيطَانُ».
[صحيح] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 4806]
المزيــد ...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అష్’షిఖ్'ఖీర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
“నేను బనూ ఆమిర్ తెగ ప్రతినిధి బృందముతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను కలవడానికి బయలుదేరి వెళ్ళాను. అపుడు (ఆయనను ప్రస్తుతిస్తూ) మేము ఇలా అన్నాము: “(ఓ ప్రవక్తా!) నీవు మా సార్వభౌముడవు”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ యే సార్వభౌముడు”. అపుడు మేము ఇలా అన్నాము: “ఘనతలో మాలో ఉత్తముడు; మహనీయతలో మాలో సమున్నతమైనవాడు (అనవచ్చునా?)”. దానికి ఆయన “మీరు సాధారణంగా మాట్లాడే మాటలే పలకండి – లేక మీరు ఒకరినొకరు పలికే విధంగా పలకండి; షైతాను మిమ్ములను ప్రలోభానికి గురిచేయనివ్వకండి.”
[దృఢమైనది] - - [سنن أبي داود - 4806]
కొంతమంది వ్యక్తుల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినది. వారు ఆయన దగ్గరికి వెళ్ళినపుడు వారు ఆయనను ప్రస్తుతించారు. వాటిలో కొన్ని మాటలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇష్టపడలేదు. వారు ఇలా అన్నారు: “(ఓ ప్రవక్తా!) నీవు మా నాయకుడవు, సార్వభౌముడవు” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: “(కేవలం) అల్లాహ్ మాత్రమే సార్వభౌముడు” ఆయన తన సృష్టి మొత్తముపై సంపూర్ణ సార్వభౌమత్వము గలవాడు. వారందరూ ఆయన దాసులు. దానికి వారు ఇలా అన్నారు: “నీవు ఘనతలో మా అందరిలో ఉత్తముడవు; స్థానములో, గౌరవములో మరియు వైశిష్ట్యములో మా అందరిలో అత్యుత్తముడవు.” “నీవు మహనీయతలో సమున్నతమైనవాడవు, మా అందరిలో ఔదార్యములో, విశిష్టతలో, స్థానములో ఉత్తముడవు.” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తాము సాధారణంగా మాట్లాడుకునే విధంగానే మాట్లాడమని, ప్రయాసపడి గొప్పగొప్ప మాటలు పలుక రాదని; ఉన్న దానిని ఎక్కువ చేసి చెప్పుట, ముఖస్తుతి చేయుట వలన షైతాను వలలో పడరాదని, అది (ఇస్లాం లో) నిషిద్ధమైన బహుదైవారాధనకు, మరియు దానికి చేరువచేసే సాధనాలకు దారి తీస్తుందని - వారికి మార్గదర్శకం చేసారు.