+ -

عن عدي بن حاتم رضي الله عنه : "أنه سمع النبي صلى الله عليه وسلم يقرأ هذه الآية: "اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلاَّ لِيَعْبُدُوا إِلَهًا وَاحِدًا لا إِلَهَ إِلاَّ هُوَ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ" فقلت له: إنا لسنا نعبدهم، قال: أليس يُحَرِّمُونَ ما أحل الله فتُحَرِّمُونَهُ؟ ويُحِلُّونَ ما حَرَّمَ الله فتُحِلُّونَهُ؟ فقلت: بلى، قال: فتلك عبادتهم".
[صحيح] - [رواه الترمذي]
المزيــد ...

అదీ బిన్ హాతిమ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ఆయన మహనీయ ప్రవక్తను ఈ ఆయత్ పటిస్తుండగా విన్నాను “ "اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلاَّ لِيَعْبُدُوا إِلَهًا وَاحِدًا لا إِلَهَ إِلاَّ هُوَ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ" {వారిలోని పండితులను మరియు సన్యాసులను అల్లాహ్ కు సాటిగా వారు ప్రభువు గా చేసుకున్నారు మరియు మర్యం పుత్రుడైన ఈసా ఆయన వారికి కేవలం ఏక దైవ ఆరాధన చేయాలని,అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్యుడు లేడు అని ,అల్లాహ్ కు సాటికల్పిస్తున్న విషయాలన్నింటి నుండి ఆయన పరిశుద్దుడు అని భోదించారు }‘నేను దైవప్రవక్తతో మేము వారిని ఆరాధించేవారము కాదు కదా ?అని అడిగాను ప్రవక్త బదులిస్తూ ‘వారు అల్లాహ్ హలాలు పర్చిన విషయాలను హరామ్ చేయలేదా మీరు వాటిని హరామ్ గా భావించలేదా? అల్లాహ్ నిషిద్దపర్చిన విషయాలను హలాల్ చేయలేదా మీరు వాటిని హలాల్ గా భావించలేదా? అని ప్రశ్నించారు,దానికి నేను అవును! అన్నాను ఆయన మరి అదే దాస్యం చూపడం అంటే అని జవాబిచ్చారు
[దృఢమైనది] - [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

వివరణ

మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యూదుల మరియు క్రైస్తవుల కు చెందిన ఈ ఆయత్ పఠించి"వారు తమ పండితులను,సన్యాసులను ప్రభువుగా మలుచుకున్నారు,వీరు ప్రజల కొరకు చట్టాలను మలిచేవారు,షరీఅతుకు వ్యతిరేఖంగా అవి ఉండేవి,ప్రజలు వారికి విధేయత చూపేవారు-అన్న విషయాలు చెప్పినప్పుడు సహాబీ విన్నారు కానీ అర్ధం ఆయనకు చేసుకోవడం క్లిష్టమైంది,ఆయన ఆరాధన అంటే సజ్దాలు మొ ”చేయడం వరకే పరిమితం అనుకున్నారు,కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు సహాబీకి కలిగిన సంశయాన్ని దూరంచేస్తూ– పండితుల మరియు సన్యాసుల ఆరాధన అర్ధఏమిటంటే ‘ అల్లాహ్ మరియు దైవప్రవక్త ఆదేశాలకు వ్యతిరేఖంగా హలాలు ను హరాము గా హరామును హలాలు గా ప్రకటించడంలో వారి కి విధేయత చూపడం.

అనువాదము: ఇంగ్లీషు ఉర్దూ స్పానిష్ ఇండోనేషియన్ ఉయ్ఘర్ బెంగాలీ ఫ్రెంచ్ టర్కిష్ రష్యన్ బోస్నియన్ సింహళ హిందీ చైనీస్ పర్షియన్ వియత్నమీస్ టాగలాగ్ కుర్దిష్ హౌసా పోర్చుగీసు మలయాళం స్వాహిలీ తమిళం బర్మీస్ జర్మన్ జపనీస్ పష్టో అస్సామీ అల్బేనియన్
అనువాదాలను వీక్షించండి

من فوائد الحديث

  1. ఉలమాలు పండితులు అల్లాహ్ ఆదేశాలలో మార్పు చేసినప్పుడు‘వారు అల్లాహ్ ఆజ్ఞలను విభేదిస్తున్నారన్న సంగతి వారి అనుయాయులు తెలిసికూడా విధేయత చూపడం పెద్ద షిర్క్ అవుతుంది.
  2. హలాల్ మరియు హరామ్ నిర్దారించడం కేవలం మహోన్నతుడైన అల్లాహ్కు మాత్రమే హక్కు ఉంది.
  3. షిర్కు రకాల్లో ఒకటి ‘షిర్కు అత్తాఆ’ ఇక్కడ ప్రస్తావించబడింది.
  4. ఆజ్ఞానులు విద్య నేర్చుకోవాలని షరీఅతు విధిపరిచినది.
  5. "ఇబాదత్"అర్ధం విశాలతతో కూడియుంది,-అల్లాహ్ ఇష్టపడే,ప్రసన్నత చెందే ప్రతీ అంతర్గత,బహిర్గత మాట మరియు కార్యం ఇబాదత్ (ఆరాధన)గా పరిగణించబడుతుంది
  6. యూదపండితుల మరియు యూద సన్యాసుల బ్రష్టత్వాన్ని తెలుపబడింది.
  7. యూదులు మరియు క్రైస్తవుల షిర్కు నిరూపించబడింది.
  8. సమస్త దైవప్రవక్తల ధర్మం యొక్క మూలం ఒక్కటే,అదే తౌహీద్.
  9. సృష్టికర్తకు అవిధేయత చూపుతూ,సృష్టికి కనపరిచే ప్రతీ విధేయత దాన్ని ఆరాధనగా పరిగణించబడుతుంది.
  10. ఆదేశంలో తెలియని దాగియున్నమర్మాన్ని ధార్మిక విజ్ఞులతో సంప్రదించడం విధి.
  11. సహాబాకు విద్య పట్లగల ఆశక్తి ఎలాంటిదో తెలుస్తుంది
ఇంకా